Home
News

Airtel Vs Vi: 1.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు??

ఇండియాలోని ప్రవేట్ టెలికాం సంస్థలు తమ యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ప్లానా లను విడుదల చేస్తూ ఉంటారు. అయితే అవి తమ యొక్క ప్రత్యర్థులు అందించే ధరల విభాగంలో దాదాపుగా సమానంగా ఉంటాయి లేదా దగ్గరగా అయినా ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థ యొక్క టారిఫ్‌లు భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అందించే వాటితో సమానంగా ఉంటాయి.

రోజువారీ డేటా

ఈ రెండు టెల్కోస్ యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను చూడటం ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. కానీ ఈ రెండు ప్లాన్లు అందించే ప్రాథమిక ప్రయోజనాలు కాకుండా మీకు చాలా సారూప్యతలు ఉండవు. వొడాఫోన్ ఐడియా యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లు భారతీ ఎయిర్‌టెల్ అందించని 'బింగే ఆల్ నైట్' మరియు 'వీకెండ్ డేటా రోల్‌ఓవర్' వంటి అదనపు ఆఫర్‌లతో కూడి ఉంటాయి. అయితే ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులు పొందుతున్న ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి Vi ప్లాన్‌లతో అందుబాటులో లేవు. భారతీ ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా యొక్క రోజువారీ 1.5GB డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ టెల్కో యొక్క వెబ్‌సైట్‌లో ప్రస్తుతం జాబితా చేయబడిన నాలుగు 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను చూడవచ్చు. ఈ ప్లాన్‌లు రూ.249, రూ.289, రూ .399 మరియు రూ .598 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్‌లన్ని కూడా అనేక ప్రయోజనాలతో లభిస్తాయి. ఇవి అన్ని కూడా 1.5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తారు. ఇంకా అన్ని ప్లాన్‌లు కూడా అదనంగా ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ఒక నెల ట్రయల్ మరియు వింక్ మ్యూజిక్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, ఒక సంవత్సరం షా అకాడమీ ఉచిత కోర్స్, అపోలో 24 | 7 సర్కిల్ , ఫ్రీ Hellotunes, FASTag లావాదేవీలపై రూ .100 క్యాష్‌బ్యాక్ వంటివి లభిస్తాయి.

ZEE5 ప్రీమియం

రూ.249 మరియు రూ.289 డ్రాల వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు 28 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అలాగే రూ.399 మరియు రూ.598 ధరలు వద్ద లభించే ప్లాన్‌లు 56 రోజులు మరియు 84 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉన్న విషయం ఏమిటంటే వినియోగదారులు దానితో పాటు ZEE5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ని కూడా ఉచితంగా పొందుతారు. లేకపోతే రూ .249 మరియు రూ.289 ప్లాన్‌ల మధ్య తేడా ఉండదు.

వోడాఫోన్ ఐడియా 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు

వొడాఫోన్ ఐడియా టెల్కో కూడా తన వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను చాలానే అందిస్తుంది. కానీ ఎయిర్‌టెల్ ప్లాన్‌లకు సమానంగా లేదా వాటి మాదిరిగానే ఉండే ప్లాన్‌లపై దృష్టి పెట్టబోతున్నాం. ఇందులో భాగంగా రూ.249, రూ.399, మరియు రూ.599 ధరల వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్లను పరిశీలిద్దాం. భారతీ ఎయిర్‌టెల్ నుండి వినియోగదారులు పొందే ధరల నిర్మాణం ఇదే. ఈ ప్లాన్‌లన్నీ కూడా వినియోగదారులకు రోజువారీ 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి.

వొడాఫోన్ ఐడియా

వొడాఫోన్ ఐడియా టెల్కో యొక్క రూ.249 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుండగా రూ.399 మరియు రూ.599 ప్లాన్‌లు వరుసగా 56 రోజులు మరియు 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ కూడా వినియోగదారులకు బింగే ఆల్ నైట్ మరియు వీకెండ్ డేటా రోల్‌ఓవర్ యొక్క అదనపు ఆఫర్‌లతో పాటు Vi మూవీస్ & టివి యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలతో లభిస్తాయి.

వొడాఫోన్ ఐడియా రూ .599 ప్లాన్

వొడాఫోన్ ఐడియా రూ .599 ప్లాన్

వోడాఫోన్ ఐడియా టెల్కో రూ.599 ధర వద్ద అందించే ప్లాన్‌ను 84 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు అందిస్తుంది. కానీ ఇది 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఇది Jio మరియు Airtel రెండూ తమ వినియోగదారులకు అందించే దానికంటే తక్కువ. ఇతర ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు పాటు Vi మూవీస్ & టీవీ యొక్క అదనపు ప్రయోజనంతో పాటుగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharti Airtel, Vodafone idea(Vi) 1.5GB Daily Data Plans: Which One Offers More Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X