మైక్రోసాఫ్ట్ ఇండియా కొత్త చైర్మన్‌గా భాస్కర్‌ ప్రమాణిక్‌ నియామకం

Posted By: Super

మైక్రోసాఫ్ట్ ఇండియా కొత్త చైర్మన్‌గా భాస్కర్‌ ప్రమాణిక్‌ నియామకం

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కార్పోరేషన్.. భారత్‌లో తన కార్యకలపాలను నిర్వహించేందుకు.. ఒరాకిల్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్‌ ప్రమాణిక్‌ను మైక్రోసాఫ్ట్‌ ఇండియా చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. భాస్కర్‌ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, మైక్రోసాఫ్ట్‌ ఇండియా చైర్మన్‌, కార్పోరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవి వెంటేషన్‌ స్థానంలో భాస్కర్‌ను నియమించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భాస్కర్.. మైక్రోసాఫ్ట్‌ అమ్మకాలు, మార్కెటింగ్‌, సర్వీసెస్‌ రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు తమ సిటిజన్‌షిఫ్‌ ఎజెండాను భారత జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా తీర్చిదిద్దగలరని మైక్రోసాఫ్ట్‌ ధీమా వ్యక్తం చేసింది.

తన నియమాకానికి సంబంధించి మైక్రోసాఫ్ట్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు జీన్‌ పిలిఫ్పి కోర్టైయిస్‌కు రిపొర్ట్‌ చేసినట్లు భాస్కర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా భాస్కర్ ప్రమాణిక్ మాట్లాడుతూ... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరడం చాలా ఆనందంగా ఉందని, సంస్థ అభివృద్ధి పరచడంతో పాటు వివిధ పరిశ్రమలు, విభాగాలు, ఉత్పత్తులు, సర్వీసులలో తనదైన పాత్రను నిర్వహిస్తానని, బిజినెస్‌ లీడర్ల భాగస్వామ్యంతో పాటు మైక్రోసాఫ్ట్‌ టీమ్‌తో తమ వ్యాపారాన్ని భారత్‌లో మరింత అభివృద్ధి పరచేందుకు కృషి చేస్తానని చెప్పారు.

సన్ మైక్రోసిస్టమ్స్‌ సంస్థలో 13 ఏళ్ల పాటు భారత్‌లో భాస్కర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతరం అమెరికాలోని కమర్షియల్‌ సిస్టమ్స్ ప్రధాన కార్యలయంలో అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రమాణిక్‌ ఆధ్వర్యంలో భారత్‌లోని సన్‌ మైక్రోసిస్టమ్స్‌ వ్యాపారం ఆరు సంవత్సరాల కాలంలో 20 మిలియన్‌ డాలర్ల నుండి 200 మిలియన్‌ డాలర్లకు పెరిగేలా చేశారు. భారత్‌లో 24 మంది ప్రారంభమైన సన్ మైక్రోసిస్టమ్‌లో ప్రస్తుతం 1,200 మందికి పైగా ఉద్యోగులున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot