Home
News

జియోసినిమా యాప్ ద్వారా బిగ్‌బాస్ OTT 2 హౌస్‌మేట్లతో లైవ్‌చాట్ చేయొచ్చు..!

IPL 2023 సీజన్‌లో జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగా మ్యాచ్‌లను ప్రసారం చేసిన జియో.. మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తు్‌న్నట్లు సమాచారం. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ద్వారా కోట్ల మంది ప్రేక్షకులు జియా సినిమా యాప్ వినియోగించేందుకు అలవాటు పడ్డారు. వీరిందరూ తమతోనే ఉండేలా జియో నిర్ణయం తీసుకుంది.

బిగ్‌బాస్‌ OTT సీజన్‌2ను జియో సినిమా యాప్‌ ద్వారా స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. జూన్‌ 17 నుంచి ఈ రియాలిటీ షో ఉచితంగా స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. బిగ్‌ బాస్‌ ఓటీటీ 2 సీజన్‌ మరింత ఇంటరాక్టివ్‌గా ఉండేలా జియో కొన్ని ఫీచర్లను పరిచయం చేయనుంది.

JioCinema

జియో సినిమా యాప్‌ ద్వారా బిగ్‌బాస్‌ OTT 2 వీక్షించే వారు నేరుగా హౌస్‌మేట్‌లతో ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు జియో తెలిపింది. ఫలితంగా వివిధ ఎలిమినేషన్లు, ఫలితాలపై నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యాలను ప్రేక్షకులు కలిగి ఉంటారని జియోసినిమా యాప్‌ పేర్కొంది.

దీంతోపాటు జియో సినిమా యాప్‌ ద్వారా మల్టీ కెమెరా స్ట్రీమింగ్‌తో మంచి అనుభూతిని పొందుతారని పేర్కొంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగే ప్రతి అంశాన్ని, కోణాన్ని చూసేందుకు ఇది అనుమతిస్తుందని తెలిపింది. ప్రేక్షకులు 1000 గంటల కంటెంట్‌తోపాటు 360 డిగ్రీల కోణంలో హౌస్‌ను చూడవచ్చని పేర్కొంది. 24 గంటలపాటు కంటెంట్‌ అందుబాటులో ఉంటుందని సమాచారం.

జియోసినిమా యాప్‌లో లైవ్‌ చాట్‌, ఎమోజీ ద్వారా హౌస్‌లో ఉన్న వారితో ప్రేక్షకులు ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఫీచర్‌ ప్రేక్షకులను బాగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. బిగ్‌బాస్‌ OTT 2 సీజన్‌ జూన్‌ 17 నుంచి జియోసినిమా యాప్‌ ద్వారా స్ట్రీమింగ్‌ అవుతుందని పేర్కొంది.

అయితే జియో సినిమా యాప్‌ ద్వారా ఇదివరకే అనేక కార్యక్రమాలను ఉచితంగా ప్రసారం చేసి.. అనేక రికార్డులను బద్దలు కొట్టింది. FIFA వరల్డ్ కప్‌ 2022 మరియు IPL 2023 సమయాల్లో కోట్లాదిమందిని సంపాదించుకుంది. IPL 2023 సమయంలో రియల్‌టైంలో వీక్షకుల సంఖ్య 44.9 కోట్లకు చేరుకుంది.

ఇదివరకు జియో సినిమా యాప్‌ భారతీయ వినియోగదారుల కోసం 999 రూపాయల వార్షిక ప్రీమియం ప్యాక్‌ను ప్రకటించింది. HBO, WBD కంటెంట్‌కు యాక్సెట్ ఉంటుంది. వీటితోపాటు FIFA, ఐపీఎల్‌, బిగ్‌బాట్‌ ఓటీటీ సహా ఎక్లూజివ్‌ డిజిటల్‌ కంటెంట్‌ ప్రసారం చేయడం ద్వారా ఓటీటీలో అగ్రస్థాయిలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ పడే విధంగా అనేక మార్పులు చేస్తోంది. కొత్త సినిమాలు, టీవీ షోలు చూడాలనుకొనే మరింత మంది సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించాలని జియో సినిమా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Big Boss OTT 2 will stream in JioCinema App from june 17
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X