బిగ్‌సీ మొబైల్స్ 12వ వార్షికోత్సవ ఆఫర్లు

Posted By:

బిగ్‌సీ మొబైల్స్ 12వ వార్షికోత్సవ ఆఫర్లు

మార్కెట్లోకి ప్రవేశించి 12 సంవత్సరాలు పూర్తవుతోన్న నేపధ్యంలో బిగ్‌సీ మొబైల్స్ కస్టమర్‌‌ల కోసం వినూత్న ఆఫర్‌లను ప్రకటించింది. శనివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని బిగ్‌సీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బిగ్‌సీ మొబైల్స్ చైర్మన్ బాలు చౌదరి వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా మొబైల్ ఫోన్‌ల కొనుగోలు పై 2 సంవత్సరాల వరకు వారంటీతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయాలను బిగ్‌సీ అందిస్తోందని తెలిపారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

తమ వద్ద మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసిన కస్టమర్లు ఆ ఫోన్లు నచ్చనట్లయితే 15 రోజులలోపు వాటిని వెనక్కు ఇచ్చి మరో ఫోన్‌ను పొందే వినూత్న సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్‌ల కొనుగోలు పై 50 శాతం వరకు తగ్గింపు, ఒకటి కొంటే మరొకటి, ఒకటి కొంటే రెండు ఉచితం, మొబైల్ ఫోన్స్ కొనుగోలు పై కచ్చితమైన ఉచిత బహుమతి వంటి ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Big C Mobiles 12th Anniversary Offers. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting