బిగ్ ‘సీ’ఆఫర్... చవర ధరకే ఫోన్‌లు!

Posted By: Staff

బిగ్ ‘సీ’ఆఫర్... చవర ధరకే ఫోన్‌లు!

రాష్ట్రంలోని అనేక  ప్రాంతాల్లో  రిటైల్ స్టోర్లను నెలకొల్పి మొబైల్‌ఫోన్‌లను విక్రయిస్తున్న సంస్థ బిగ్‘సీ’.ఆంధ్రప్రదేశ్ మొబైల్స్ రిటైల్ విక్రయ రంగంలో  క్రియాశీలక పాత్రపోషిస్తున్న ఈ సంస్థ వేసవిని పురస్కరించుకుని  ప్రత్యేక సమ్మర్ ఆఫర్లను ప్రవేశపెట్టింది.


వీటికి సంబందించిన వివరాలను బిగ్ ‘సీ’ సంస్థల ఛైర్మన్ ఎం.బాలూ చౌదరి వెల్లడించారు.  తక్కువ ధరలకే అధునాతన ఫీచర్లు కలిగిన మొబైల్స్‌ను అందించడంతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను, డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆఫర్లు ఇవీ...

- పాత మొబైల్ (పనిచేయకున్ననూ) ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 1899కే సెల్‌కాన్ సి 606 మొబైల్ ను అంది స్తోంది. దీనితోపాటు 4జీబీ మెమరీ కార్డు ఉచితం.

- పాత మొబైల్ (పనిచేయకున్ననూ) ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 999కే కార్బన్ కె 106 మొబైల్, దానితోపాటు ఒక హాట్‌బాక్స్ ఉచితంగా అందజేస్తోంది.

-  రూ.3599 విలువ గల కార్బన్ కె19 మొబైల్‌పై 35 శాతం డిస్కౌంట్.

-  రూ. 6999 విలువ గల సెల్‌కాన్ ఏ1 మొబైల్‌పై 50 శాతం డిస్కౌంట్.

-  రూ. 2199 విలువైన సెల్‌కాన్ సి337 మొబైల్‌పై 40% డిస్కౌంట్.

వీటితోపాటు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బంగారు, వెండి నాణాలు, హాట్‌బాక్స్‌లు, హెడ్‌సెట్‌లు, మెమరీ కార్డులు, బ్లూటూత్‌లను బహుమతులుగా అందిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు బిగ్ సి ఆఫర్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించిందని, సమ్మర్ ఆఫర్లకు కూడా ఇదే విధమైన స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్టు బాలు చౌదరి తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot