చరిత్రపుటల్లోకి జారుకుంటున్న విషాదాలు ఇవే

మరో కొద్ది రోజుల్లో ఈ ఏడాది కనుమరుగు కాబోతోంది. అది చరిత్ర పుటల్లోకి వెళతూ మరిని విషాదాలను తనతో తీసుకువెళుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఏడాది టెక్ రంగంలోని కొన్ని దిగ్గజాలకు భారీ షాక్ తగిలింది.

|

మరో కొద్ది రోజుల్లో ఈ ఏడాది కనుమరుగు కాబోతోంది. అది చరిత్ర పుటల్లోకి వెళతూ మరిని విషాదాలను తనతో తీసుకువెళుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఏడాది టెక్ రంగంలోని కొన్ని దిగ్గజాలకు భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా ఫేస్‌బుక్ , గూగుల్ లాంటి సంస్థలు ఈ ఏడాది బాగా దెబ్బతిన్నాయి. అమెరికాలో జరిగిన 2016 ఎన్నికల్లో ఈ రెండూ డేటా లీక్ యవ్వారానికి కేంద్రబిందువుగా మారాయి. ఇక మరో టెక్ గెయింట్ ఆపిల్ ఈ ఏడాది నిరాశాజనక ఫలితాలను మూటగట్టుకుంది. ఈ సంధర్భంగా 2018లో టెక్ గెయింట్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ ని ఓ సారి పరిశీలిద్దాం.

షియోమి షియోమి "No.1 Mi Fan Sale " షురూ..!

ఫేస్‌బుక్ కేంబ్రిడ్జి ఎనాలిటికా డేటా స్కాం

ఫేస్‌బుక్ కేంబ్రిడ్జి ఎనాలిటికా డేటా స్కాం

ఫేస్‌బుక్ కేంబ్రిడ్జి ఎనాలిటికా డేటా స్కాంలో చిక్కుకుని విలవిలలాడింది. ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్‌, ఫేక్‌ న్యూస్‌ ప్రకంపనలు, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పదవికే ఎసరు తెచ్చాయి. కంపెనీ చైర్మన్‌గా జుకర్‌బర్గ్‌ను తొలగించాలని ఫేస్‌బుక్‌ ఇంక్‌లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న కంపెనీలు మార్క్‌ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చాయంటే ఇది ఏ స్థాయిలో జరిగిందో తెలుుకోవచ్చు. కోట్ల నష్టాలను మూటగట్టుకుంది

సారీ చెప్పిన జుకర్ బర్గ్

సారీ చెప్పిన జుకర్ బర్గ్

యూఎస్ కాంగ్రెస్ ముందు హాజరైన ఫేస్‌బుక్ వ్యవ్యస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉన్నతస్థాయి కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన 33 ఏళ్ల జుకర్.. తాను చేసింది పెద్ద తప్పుగా భావిస్తున్నానని, 'ఫేస్‌బుక్‌ను మొదలుపెట్టింది నేనే.. సంస్థలో ఏం జరిగినా దానికి పూర్తి స్థాయి భాద్యత నాదే. నాకు ఒక అవకాశం ఇస్తారని భావిస్తున్నా' అని కన్నీటిని కార్చారు.ఫేస్‌బుక్‌కు చెందిన 8.7 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడలేకపోయినందుకు తనను క్షమించాలని జుకర్‌బర్గ్ అమెరికా చట్టసభను కోరారు.

ట్రంప్‌ గెలుపునకు దోహదం

ట్రంప్‌ గెలుపునకు దోహదం

2016 సంవత్సరంలో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికా అనే సంస్థ లీక్‌ చేసి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపునకు దోహదం చేయడంతో పాటు, భారత్‌ సహా వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు డేటాను అందించిందన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ డేటా లీకేజీ నిజమేనని, తప్పు జరిగిదంటూ జుకర్‌బర్గ్‌ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో డేటా భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు కూడా చేపట్టారు.

ప్రశ్నార్థకంగా గూగుల్ డేటా

ప్రశ్నార్థకంగా గూగుల్ డేటా

సామాజిక మాధ్యమాల్లోని డేటా లీక్‌ వ్యవహారం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. సోషల్‌ మీడియా యూజర్ల వ్యక్తిగత సమాచారం ఎంత సేఫ్‌గా ఉందనే ప్రశ్నలు హడలెత్తిస్తున్న పరిస్థితుల్లో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, నేనేమన్నా తక్కువనా అన్నట్లు గూగుల్‌ తోడయింది. మనం ప్రతీ చిన్న విషయానికి ఆధారపడే గూగుల్‌ కూడా మన ప్రతి కదలికను డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నట్టు, మనకు సంబంధించిన ప్రతీ అంశాన్ని భద్రపరుస్తున్నట్టు వెల్లడైంది. ఆయా సందర్భాలు, యాప్‌లను ఉపయోగించినపుడు, మనం రోజూ మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో నిర్వహించే కార్యకలాపాలు, ఇలా అన్ని విషయాలు గూగుల్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌లలో రికార్డవుతున్నట్టు తేలింది. మీరు మీ మొబైల్‌ ఫోన్‌ను తెరిచిన ప్రతీసారి మీరెక్కడ ఉన్నారో తెలిసిపోతుంది! మీ ఫోన్లో గూగుల్‌ యాప్‌ను ఉపయోగించడం మొదలుపెట్టిన తొలిరోజు నుంచి ఇప్పటివరకు ఎక్కడెక్కడికి వెళ్లారో తేదీలతో సహా టైమ్‌లైన్‌లో రికార్టవుతున్నాయి. దీనికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ House Judiciary Committee ముందు హాజరు కావాల్సి వచ్చింది. కాగా గతేడాది కూడా గూగుల్ ఇటువంటి స్కాంల్లో ఇరుక్కుని దాదాపు 2.7 billion డాలర్ల జరిమానాను ఎదుర్కుంది.

 

 

ఆపిల్ ఘోష

ఆపిల్ ఘోష

ఆపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఓఎస్ దాని కొంపలు ముంచింది. ఈ ఫీచర్ ద్వారా బ్యాటరీలు డెడ్ అవుతున్నాయని యూజర్లు గగ్గోలు పెట్టారు. పాత ఐఫోన్లు ఈ కొత్త ఐఓఎస్ ద్వారా డెడ్ అవుతున్నాయని ఆపిల్ కంపెనీకి కంప్లయింట్లు మీద కంప్లయిట్లు వెళ్లాయి.

 

 

హువాయి గందరగోళం

హువాయి గందరగోళం

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ హువాయి టెక్నాలజీస్‌ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) మెంగ్‌ వాంగ్జౌను కెనడా అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇరాన్‌పై అమెరికా విధించిన వాణిజ్య ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్‌ చేసినట్టు కెనడా, అమెరికా బుకాయిస్తున్నాయి. మెంగ్‌ అరెస్ట్‌పై చైనా విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హక్కుల ఉల్లంఘన అని ఘాటుగా పేర్కొంది. మెంగ్‌ను తక్షణమే విడుదల చేయాలని కెనడాలోని చైనా ఎంబసీ డిమాండ్‌ చేసింది. చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌లో భాగంగా హువావే డిప్యూటీ చైర్మెన్‌ హోదాలో ఉన్న మెంగ్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. మెంగ్‌ను అరెస్ట్‌ చేసినట్టు వార్తలు వెలువడగానే కెనడాలోని చైనా దౌత్య కార్యాలయ అధికారులు ఆందోళన చేస్తున్నారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మెంగ్‌ అరెస్ట్‌తో ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. చైనాలో కూడా ఆమె అరెస్ట్‌ పట్ల నిరసన వ్యక్తమవుతోంది.

 

 

Broadcomm-Qualcomm

Broadcomm-Qualcomm

2017లో క్వాల్ కామ్ తో టై అప్ అయ్యేందుకు బ్రాడ్కామ్ దాదాపు 117బిలియన్ డాలర్లను ఆఫర్ చేసింది. అయితే క్వాల్ కామ్ ఈ ఆఫర్ ని తిరస్కరించింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు దిగ్గజాలు పొత్తుల కొసం మరొక్కసారి కలవనున్నాయి. అయితే ఇది రాజకీయ వ్యవహాంతో ముడిపడి ఉన్నందుకున కంపెనీలు ఏం చేస్తాయోనని టెక్ విశ్లేషకులు తమ మెదడుకు పదును పెడుతున్నారు.

ZTE

ZTE

చైనీస్ దిగ్గజం జడ్‌టిఈ ఈ ఏడాది చైనా, అమెరికా బంధానికి నిప్పు రాజేసింది.అమెరికా ఒత్తిడితో ఆర్థిక మార్కెట్లలోని కంపెనీలకు తక్షణ సవాళ్లను కలిగించాయి. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ కంపెనీ ఇరాన్ తో వర్తకం చేసిందంటూ అమెరికా ఆరోపణలు గుప్పించింది. దీంతో US కంపెనీలు చైనీస్ కంపెనీలతో వర్తకం నిలిపివేసాయి. ఇరాన్ మరియు ఉత్తర కొరియాపై US ఆంక్షలు ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం జరిగింది. ZTE గత సంవత్సరం నేరాన్ని అంగీకరించింది.

 

 

ఇంటెల్

ఇంటెల్

ఇంటెల్ కూడా ఈ ఏడాది భారీగానే నష్టపోయింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన రెండు ప్రాసెసర్లు అనేక మేజర్ సమస్యలను ఎదుర్కున్నాయి. కంపెనీ దీన్ని సరిదిద్దినప్పటికీ నష్టం మాత్రం అలాగే మిగిలిపోయింది.

Best Mobiles in India

English summary
Biggest controversies that shook tech industry in 2018 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X