టెక్నాలజీ అపజయాలు (2013)

Posted By:

టెక్నాలజీ ప్రియులకు గుర్తిండిపోయే సంవత్సరంగా 2013 చరిత్రలో నిలుస్తుంది. ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అనేక ఆవిష్కరణలు ఆధునిక సాంకేతికతకు అద్దం పట్టాయి. టీవీలుమొదలుకుని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు పూర్తి హైడెఫినిషన్ సాంకేతికతతో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, బెలూన్ ఇంటర్నెట్ వ్యవస్థకు నాంది పలికింది.

చిన్నపాటి పార్శిల్స్‌ను మోసుకెళ్లేగలిగే రోబోట్ డ్రోన్‌లను ఆమెజాన్ వృద్ధి చేసింది. మరోవైపు యాపిల్ 64బిట్ ప్రాసెసింగ్ వ్యవస్థ పై స్పందించే మొబైల్ ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఆటలోనూ గెలుపు ఓటములు ఉన్నట్లు 2013 విజయాలతో పాటు అపజయాలను చెవి చూసింది. 2013కుగాను టెక్నాలజీ పరిశ్రమలో చోటు చేసుకున్న పలు అపజయాలను మీతో షేర్ చేసుకుంటున్నాం......

నిరాశపరిచిన ఐఫోన్ 5సీ:

యాపిల్ నుంచి 2013లో విడుదలైన ఐఫోన్ 5సీ మార్కెట్‌ను అంతాగా ఆకట్టుకోలేకపోయింది. ఐఫోన్5 స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండటం, ప్లాస్టిక్ బాడీ వంటి అంశాలు ఆకట్టుకోలేకపోయాయి. యాపిల్ నుంచి ఐఫోన్5కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ఐఫోన్ 5ఎస్ మార్కెట్లో ఘన విజయాన్ని అందుకుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ అపజయాలు (2013)

నిరాశపరిచిన ఐఫోన్ 5సీ:

యాపిల్ నుంచి 2013లో విడుదలైన ఐఫోన్ 5సీ మార్కెట్‌ను అంతాగా ఆకట్టుకోలేకపోయింది. ఐఫోన్5 స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండటం, ప్లాస్టిక్ బాడీ వంటి అంశాలు ఆకట్టుకోలేకపోయాయి. యాపిల్ నుంచి ఐఫోన్5కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ఐఫోన్ 5ఎస్ మార్కెట్లో ఘన విజయాన్ని అందుకుంది.

 

టెక్నాలజీ అపజయాలు (2013)

ఆకట్టుకోలేకపోయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

వరుస విజయాలను నమోదు చేస్తూ మార్కెట్ రారాజుగా  వెలుగొందుతున్నసామ్‌సంగ్‌కు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ ఎస్4 ఆశించిన స్ధాయిలో సత్ఫలితాన్నివ్వలేదనే చెప్పొచ్చు. అధిక శాతం మంది విశ్లేషకులను గెలాక్సీ ఎస్4 అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 

టెక్నాలజీ అపజయాలు (2013)

సామ్‌సంగ్ గెలాక్సీ గేర్

విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకున్న సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ గేర్ అటు విశ్లేషకులను ఇటు వినియోగదారులను మెప్పించటంతో విఫలమైందనే చెప్పొచ్చు.

 

టెక్నాలజీ అపజయాలు (2013)

బ్లాక్‌బెర్రీ:

2013 ఆరంభంలో బ్లాక్‌బెర్రీ నుంచి విడుదలైన బీబీ 10 ఆపరేటింగ్ సిస్టం ఆశించిన స్థాయిలో మార్కెట్ చేయలేకపోయింది. ఈ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విడుదలైన జెడ్10, క్యూ10 స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ వద్ధ బోల్తా పడ్డాయి.

 

టెక్నాలజీ అపజయాలు (2013)

నోకియా

నోకియాకు ఈ సంవత్సరం పెద్ద పీడకలే అని చెప్పొచ్చు. తక్కువ ధర మొబైల్ ఫోన్‌‍ల విభాగంలో నోకియా రాణించినప్పటికి అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఆశించిన ఫలితాలను నోకియా రాబట్టలేకపోయింది. మరోవైపు వరుస నష్టాలను నమోదు చేస్తున్న నోకియా మొబైల్ డివిజన్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసేంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot