మైక్రోసాఫ్ట్‌కు 40ఏళ్లు.. 10 ఆసక్తికర విషయాలు

Posted By:

ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్' ఒకటి. 1975 ఏప్రిల్ 4న బిల్‌గేట్స్ ఇంకా పాల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి.

మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ ప్రముఖ మొబైల్ ఫోన్ ల తయారీ కంపెనీ నోకియాను సొంతం చేసుకుది. తాజాగా విండోస్ 10 పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మైక్రోసాఫ్ట్ నేటితో 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ కంపెనీ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిల్ గేట్స్ 17వ ఏటనే తన మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను ఓ హైస్కూల్‌కు విక్రయించారు. దాని విలువ 4,200 డాలర్లు.

సీయాటిల్‌కు చెందిన సీసీసీ (కంప్యూటర్ సెంటర్ కొర్పొరేషన్) గేట్స్‌తో పాటు మరో ముగ్గురు స్కూల్ విద్యార్థులను బ్యాన్ చేసింది.

స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో బిల్ గేట్స్ 1600లక గాను 1590 మార్కులను స్కోర్ చేసినట్లు పలు రిపోర్ట్ లు పేర్కొన్నాయి.

బిల్ గేట్స్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువును అర్థంతరంగా ముగించారు. మైక్రోసాఫ్ట్ పై దృష్టి సారించే క్రమంలో గేట్స్ కళాశాల విద్యను ఆపివేయాల్సి వచ్చింది. 2007లో ఎట్టకేలకు గేట్స్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీని పూర్తి చేయగలిగారు.

తన హైస్కూల్ మిత్రుడు పాల్ అలెన్‌తో కలిసి బిల్ గేట్స్ 1975లో మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు.

మైక్రోసాఫ్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతమవటంతో 31వ ఏటకే బిల్ గేట్స్ బిలియేనీర్‌గా మారిపోయారు.

గేట్స్ తన చిరకాల మిత్రురాలు మిలింగా ఫ్రెంచ్‌ను జనవరి 1, 1994న వివాహమాడారు. వీరికి ముగ్గురు సంతానం.

మార్చి 2005లో ఇంగ్లాండ్ రాణి నుంచి గౌరవ నైట్‌హుడ్ సత్కారాన్ని పొందారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో 1977లో అరెస్ట్ అయ్యారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bill Gates,10 little-known facts. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot