మైక్రోసాప్ట్ అధినేత కూతురు చేతిలో 'ఆపిల్ ఐఫోన్'

Posted By: Super

 మైక్రోసాప్ట్ అధినేత కూతురు చేతిలో 'ఆపిల్ ఐఫోన్'

 

ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు బిల్ గేట్స్. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత మరియు గొప్ప దాతగా... ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తిగా చరిత్రలో బిల్ గేట్స్ స్దానం ప్రత్యేకం. వ్యక్తిగత ఉపయోగాలకోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులో తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు. ప్రస్తుతం బిల్ గేట్స్ ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్‌వేర్ ప్రపంచాన్ని బిల్‌గేట్స్ తన హస్తగతం చేసుకున్నారు.

కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కరణలకూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్‌గేట్స్ తనకు ఈ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నారు.అనతి కాలంలో బిల్ గేట్స్ మిలియనీర్ అయ్యాడు. ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తికాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌లో తన కార్యకలాపాలకు శుక్రవారం(28 జూన్, 2008) బిల్ గేట్స్ వీడ్కోలు పలికారు.

1999లో బిల్ గేట్స్ ఆస్థి విలువ 101 బిలియన్లు చేరుకొన్నపుడు అందరూ బిల్ గేట్స్‌ను మొట్ట మొదటి 'సెంటి బిలియనీరు ' అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ఆ విలువ తగ్గుతూ వచ్చినప్పటికీ 1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. 2007 లెక్కల ప్రకారం బిల్ గేట్స్ ఆస్థి విలువ 58 బిలియన్ డాలర్లు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నొ దానాలు, సహాయాలు చేసాడు. చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ రూపకల్పన, అభివృద్ధికి జీవితాన్ని ధారపోసిన గేట్స్ కొత్త వాక్సిన్‌లను కనుగొనే సంష్టలకు నిధులు సమకూర్చటం తన వంతు సహాయం చేసే కార్యకలాపాల మీద ద్రుష్టి పెట్టబోవుచున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మిగిలిన జీవితాన్ని, శక్తిని వినియోగించనున్నారు.

వాషింగ్టన్ లో 5.15 ఎకరాల విశాలమయిన ఎస్టేట్‌లో దాదాపు 50,000 చదరపు అడుగులు విస్తీర్ణంగల ఇల్లు వీరి నివాస స్థలము. 2005 లెక్కల ప్రకారం ఈ ఇంటి విలువ $135 మిలియన్ డాలర్లు. ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు ఏడేళ్ళు పట్టింది. బిల్ గేట్స్ భార్య పేరు మెలిండా. వారికి ముగ్గురు పిల్లలు. బిల్ గేట్స్ తన కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఆపిల్ ఉత్పత్తులను వాడొద్దని చూసిస్తూ ఉంటాడు. కానీ పిల్లలు మాత్రం అప్పుడప్పుడు తల్లి దండ్రుల మాటలను పెడచెవిన పెడుతుంటారు.

సరిగ్గా బిల్ గేట్స్ ఇంట్లో కూడా అదే జరిగింది. బిల్ గేట్స్ ముద్దుల కూతురు 10 సంవత్సరాల వయసు కలిగిన 'ఫోబ్' మాత్రం బిల్ గేట్స్ చెప్పిన మాటలను ఖాతరు చెయ్యకుండా ఆపిల్ ఐపోన్‌ని వాడుతుంది. ఆస్టేలియాలోని సిడ్నీ నగరంలో తన తల్లి మిలిండాతో కలసి చిన్నారి 'ఫోబ్' ఆపిల్ ఐఫోన్‌తో వెళుతుండగా కెమెరాలో బంధించిన చిత్రమిది. దీనిని బట్టి తెలిసింది ఏమిటంటే తమ పిల్లలు కొన్ని సార్లు ఇష్టం లేని పనులు చేసినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం సర్దుకుపోతారనడానికి నిదర్శం ఈ చిన్న ఉదాహరణ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot