ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

|

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులైన బిల్‌గేట్స్ మరోసారి ప్రపంచపు అత్యంత సంపన్నమైన వ్యక్తిగా చరిత్రకెక్కారు. స్టాక్‌మార్కెట్లో మైక్రోసాఫ్ట్ షేర్లు ఒక్కసారిగా పంజుకోవటంతో బిల్‌గేట్స్ సంపద 10శాతానికి పెరిగింది. దింతో సంపన్నుల జాబితాలో ముందంజలో దూసుకుపోతున్న మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్‌ను గేట్స్ అధిగమించటం జరిగిందని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.

గురువారం స్టాక్ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ఇంకా టెలికామ్ బిల్ పై మెక్సికో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానం కారణంగా కార్లోస్ స్లిమ్ సంపదకు 2 బిలియన్‌ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. గేట్స్ ప్రస్తుత నికర సంపద విలువ $72.1 బిలియన్లు. 2007 నుంచి బిల్ గేట్స్ ఇంకా అతని భార్య మిలిండా ఛారిటీలకు $28 బిలియన్‌లను దానం చేసారు. బిల్‌గేట్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్.

 ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

 ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.

 ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..
 
ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి US$15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

 ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు. మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు.

 ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు.

 ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

ప్రపంచపు సంపన్నమైన వ్యక్తిగా మరోసారి బిల్‌గేట్స్..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X