అయన మాటల మాంత్రికుడు, బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు

By Gizbot Bureau
|

మాటల మాంత్రికుడు ఆపిల్‌ మాజీ సీఈఓ, దివంగత స్టీవ్‌ జాబ్స్‌ది అద్భుత నాయకత్వం అని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రశంసించారు. ఆయన మాటల మాంత్రికుడని, తన మాటలతో ఉద్యోగులను లక్ష్యాల సాధనకు ప్రేరేపించడంతోపాటు వారు ఎక్కువ గంటలు పనిచేసేలా ప్రోత్సహించేవాడన్నారు.

 Bill Gates Says Steve Jobs Cast Spells To Keep Apple From Dying

ఉద్యోగులకు ప్రేరణ కలిగించి మరిన్ని ఎక్కువ గంటలు ఉత్సాహంగా పనిచేసేలా చూసే అద్భుత చాతుర్యం స్టీవ్ జాబ్స్ లో అమితంగా ఉండేదని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఆపిల్ ముఖ్యకార్యనిర్వహణాధికారి (సీఈఓ) గా వ్యవహరించిన, స్టీవ్‌ జాబ్స్‌ పాంక్రియాటిక్ క్యాన్సర్తో 2011లో మరణించిన సంగతి విదితమే. నాయకత్వంపై సీఎన్ఎన్ చేసిన ఇంటర్వ్యూలో బిల్గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  మూత బడాల్సిన ‘ఆపిల్

మూత బడాల్సిన ‘ఆపిల్

మూసివేసే దశకు చేరుతున్న ఆపిల్ను నిలబెట్టి, అత్యంత విలువైన సంస్థగా తీర్చిదిద్దడంలో స్టీవ్‌ జాబ్స్‌ అసమాన నాయకత్వ ప్రతిభ చూపారని బిల్ గేట్స్ వివరించారు. ‘స్టీవ్‌ జాబ్స్‌ అద్భుత చాతుర్యం కలిగిన నిపుణుడు. ఆయన ధాటికి ప్రజలు మైమరచిపోయేవారు. అతను మాట్లాడుతుంటే అందరూ మంత్ర ముగ్ధులైపోవడం నేను చూశాను. అయితే నేను కూడా చిన్నపాటి మాంత్రికుడిని కావడం వల్ల, నేను మాత్రం బయట పడ్డాను' అని బిల్గేట్స్ పేర్కొన్నారు.

 మరో వ్యక్తిని మళ్లీ కలవలేదు

మరో వ్యక్తిని మళ్లీ కలవలేదు

నైపుణ్యాన్ని వెలికితీసి, మరింతగా ప్రేరణ కలిగించే స్టీవ్‌ జాబ్స్‌ వంటి మరో వ్యక్తిని మళ్లీ కలవలేదు' అని గేట్స్ తెలిపారు. అలాంటి వ్యవహారశైలి వల్లే, ఎనలేని సానుకూల పరిణామాలను స్టీవ్ ఆవిష్కరించగలిగారని ప్రశంసించారు. స్టీవ్ జాబ్స్ తరవాత ఆపిల్ సీఈఓగా టిమ్ కుక్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే. మీ నాయకత్వ శైలి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బిల్గేట్స్ బదులిస్తూ ‘న్యాయశాఖ తీర్పులో మినహా, ఖాతాదార్లు లేదా విలేకరులు ఎవరూ కూడా నేను నిరంకుశంగా, మొరటుగా, ఆజ్ఞాపించేలా వ్యవహరిస్తాను అని చెప్పలేదు' అని తెలిపారు.

 మొండితనంతో పాటు
 

మొండితనంతో పాటు

ఉద్యోగులు, కార్మికుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి, వారిలో మరింత ప్రేరణ కలిగించే స్టీవ్‌జాబ్స్‌ లాంటి మరో వ్యక్తిని తాను మళ్లీ కలవలేదని, అలాంటి శైలితోనే ఆయన సాధ్యంకాని సానుకూల పరిణామాలను ఆవిష్కరించగలిగారని ప్రశంసించారు. స్టీవ్‌జాబ్స్‌లోని మొండితనంతో పాటు కొన్ని సానుకూల విషయాలను తెచ్చాడని తెలిపారు గేట్స్.

ఆధ్యాత్మిక భాగస్వామి

ఆధ్యాత్మిక భాగస్వామి

కాగా, ఆపిల్ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్.. 1997లో మునిగిపోతున్న సంస్థకు తిరిగి నిలబెట్టారు. దానికోసం ఆపిల్ ప్రధాన కార్యాలయంలో ఆయన శ్రమించే బ్రిటిష్ డిజైనర్‌ను కనుగొన్నాడు. ఆపిల్ యొక్క క్షీణతను తిప్పికొట్టగల మరియు అతని "ఆధ్యాత్మిక భాగస్వామి" గా మారగల ఒక ప్రతిభను అతను ఈవ్‌లో కనుగొన్నట్లు జాబ్స్ గ్రహించాడు. ఇక, పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతో స్టీవ్‌జాబ్స్‌ 2011లో కన్నుమూశారు.

Best Mobiles in India

English summary
Bill Gates Says Steve Jobs Cast "Spells" To Keep Apple From Dying

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X