Home
News

జియో మరో షాక్.. పాపులర్ ప్లాన్ ధర అమాంతం పెంచేసింది.. సామాన్యుడికి మరింత భారం!

By Ram Kumar

ఈ రోజుల్లో మొబైల్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. టెలికాం కంపెనీలు ప్లాన్ ధరలు పెంచుతూ ఉంటే, సామాన్యుడి నెత్తిన భారం మోపినట్లు అవుతోంది. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం జియో (Jio) తన వినియోగదారులకు షాకిస్తూ ఓ పాపులర్ ప్లాన్‌పై ఏకంగా వంద రూపాయలు పెంచేసింది.

* పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర ఒక్కసారిగా పైకి..

జియో తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకుముందు రూ.199కే లభించే చౌకైన ప్లాన్ ధరను అమాంతం పెంచేసింది. ఇకపై ఈ ప్లాన్ కోసం మీరు ఎక్స్‌ట్రాగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, జనవరి 23వ తేదీ నుంచి ఈ ప్లాన్ ధర రూ.299కి చేరుకుంటుంది. గతేడాది జులైలోనూ జియో చాలా ప్లాన్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే.

Big Shock For Jio Users

* ధర పెరిగినా.. బెనిఫిట్స్ మాత్రం అవే

అయితే, రూ. 299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో లభించే బెనిఫిట్స్ మాత్రం మారలేదు. మునుపటిలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, 25GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఫ్రీ SMSలు, ఉచిత నేషనల్ రోమింగ్ వంటి సేవలు యథావిధిగా కొనసాగుతాయి. కాకపోతే, ఈ ఫీచర్లను పొందాలంటే మాత్రం నెలకు అదనంగా రూ. 100 చెల్లించక తప్పదు.

* కొత్త యూజర్లకు కాస్త రిలీఫ్.. చౌకైన ప్లాన్ ఇదే..

కొత్తగా జియో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకునే వారికి మాత్రం కాస్త ఊరట లభిస్తుంది. వారి కోసం జియో చౌకైన ప్లాన్‌ను రూ.349కి అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, 30GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5G యాక్సెస్, రోజుకు 100 SMSలు, ఉచిత నేషనల్ రోమింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.

* ఫ్యామిలీ ప్లాన్‌తో మరింత ఆదా..

ఇక, జియో ఫ్యామిలీ ప్లాన్ గురించి చెప్పాలంటే.. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.449 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 75GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 5G సేవలు, రోజుకు 100 ఫ్రీ SMSలు లభిస్తాయి.

అంతేకాదు, అదనంగా మరో ముగ్గురు సభ్యులను చేర్చుకునే అవకాశం కూడా ఉంది. ఒక్కో నంబర్‌కు నెలకు రూ. 150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఎక్స్‌ట్రా నంబర్‌కు 5GB డేటా ఎక్కువగా లభిస్తుంది.

* బడ్జెట్ యూజర్లకు జియో ప్రీపెయిడ్ ప్లాన్..

బడ్జెట్ యూజర్ల కోసం జియో మరో అదిరిపోయే ప్లాన్‌ను అందిస్తోంది. అదే రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది.

అలాగే, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో సినిమా ప్రీమియం మినహా ఇతర జియో యాప్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. సాధారణ కనెక్టివిటీ, తక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఇదిలా ఉండగా బ్యాంకుల పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యాంకులు తమ లావాదేవీలు, ప్రమోషన్లకు సంబంధించిన కాల్స్ కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఆ నంబర్లు '1600'తో ప్రారంభమవుతాయి. కాబట్టి, మీకు బ్యాంక్ సంబంధిత కాల్ ఏదైనా వస్తే, అది 1600తో మొదలయ్యే నంబర్ నుంచే వచ్చిందో లేదో సరి చూసుకోవచ్చు. ఈ మార్పు ద్వారా ప్రజలు మోసపూరిత కాల్స్‌ను సులువుగా గుర్తించి ఆర్థిక మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Bill Shock For Jio Users Rs 100 Price Hike for Popular Pla
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X