బింగ్ లేదా గూగుల్ సెర్చ్! మీకు ఏది కావాలి?
వెబ్ సెర్చ్ ఇంజిన్ అనగానే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది గూగుల్. అంశం ఏది అయినా సరే ఇంటర్నెట్లో సెర్చ్ చేయాలంటే...చాలామంది ఎక్కువగా ఉపయోగించేది గూగుల్ సెర్చ్. కానీ కేవలం గూగుల్ మాత్రమే కాదు. ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా సెర్చ్ ఇంజిన్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

ఒక మంచి సెర్చ్ ఇంజిన్ తయారు చేయడం అనేది అంత సులభం కాదు. పెట్టుబడితోపాటు కావాల్సిన నిధులు ఉండాలి. వీటితోపాటు క్రియేట్ చేయడానికి సంవత్సరాల సమయం పడుతుంది. వీటన్నింటిని పక్కన పెట్టినట్లయితే....ఇప్పటికే కొన్ని సెర్చ్ ఇంజిన్లు చూస్తున్నాము. వీటిలో గూగుల్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. గూగుల్ తర్వాత అత్యంత ప్రాధాన్యత పొందిన సెర్చ్ ఇంజిన్ మైక్రోసాఫ్ట్ కు చెందిన బింగ్.
బింగ్ మరియు గూగుల్లో ఉన్న ప్రధాన వ్యత్యాసాలను చూసినట్లయితే...ఒక మంచి సెర్చ్ ఆప్షన్ను ఎంచుకోవడానికి వీటిలో మీకు ఏది సహాయపడుతుందో చూడండి.

సెర్చ్ క్వాలిటీ....
క్వాలిటీని సెర్చ్ చేసే విషయానికి వస్తే....గూగుల్ యూజర్ల కంటే బింగ్ తో మంచి ఫలితాలు వస్తున్నట్లు చాలా మంది యూజర్లు వెల్లడించారు. ఎందుకంటే...ఆల్గారిథమ్ లో కొన్ని మెరుగుదలలను గూగూల్ చేస్తోంది. వినియోగదారులకు వారి అవసరాలకు బదులుగా ఏం అవసరమో వాటిని ఎక్కువ ద్రుష్టిని పెడుతుంది. బింగ్ ఎల్లప్పుడూ బెసిక్ ఇన్షర్మేషన్ కోసం ఫలితాన్ని అందిస్తుంది. మీరు మార్కెటింగ్ ఇండస్ట్రిలో ఉంటే...మీకు బింగ్ మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి సహాయం చేస్తుంది.

వీడియో సెర్చ్....
వీడియో సెర్చ్ గురించి చర్చించినట్లయితే...వీడియోకోసం సెర్చ్ చేస్తున్నవారిని బింగ్ కంటే గూగుల్ మంచి రిజల్ట్ ఇస్తుంది. గూగుల్ సెర్చ్ లో వీడియోలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ యొక్క బింగ్, దాని సెర్చ్ ఫలితాల్లో యూజర్లకు మరిన్ని వీడియోలను చూపిస్తుంది. వీడియో సెర్చ్ సౌకర్యవంతంగా ఉంటుంది.

ఆటోకంప్లీట్...
రెండు సెర్చ్ ఇంజిన్లు మంచి ఆటోకంప్లీట్ సూచనలు అందిస్తాయి. కానీ అది చూపిస్తున్న సంఖ్యల విషయానికి వస్తే...బింగ్ కి 8 ఉంది, గూగుల్ 4కలిగి ఉంది. మార్కెటింగ్ వచ్చినప్పుడు ఆటోకంప్లీట్ సూచనలతో వినియోగదారులు కంటెంట్ను కనుగొనడంలో సహాయపడుతాయి.

పెయిడ్ ప్రమోషన్...
ప్రచారం కోసం తక్కువ ఖర్చుతో సైట్ ను పబ్లిసిటి చేయడానికి బింగ్ వారికి మంది అవకాశాలను అందిస్తుంది. మీ ప్రకటనలు మెరుగ్గా పనిచేస్తాయి. ఇది గూగుల్ తో మీకు లభించే దానికంటే ఎక్కువ ROI ఉంటుంది.

ఇతర ఫీచర్స్...
ఇక అదనపు ఫీచర్స్ విషయానికొస్తే...బింగ్ మరియు గూగుల్ రెండూ వాటి నుంచి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కొన్ని సందర్భాలో ఇమేజ్ సెర్చ్ కోసం స్క్రోల్ సైట్లో వారి యాక్టివిటీ క్రెడిట్లను పొందడానికి సెర్చ్ రివార్డ్స్ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ అమలు చేయడంలో మొట్టమొదటిది.

ఏది మంచిది?
పైన తెలిపిన సమాచారాన్ని పరిశీలించినట్లయితే...బింగ్ మరియు గూగుల్ ఈ రెండింటిలో ఏది మంచిది. యూజర్ కోసం ఏది మంచి విషయాలను అందిస్తుంది. కేవలం గూగుల్ మాత్రమే కాదు...మీకు మంచి సైట్ను అందించడానికి బింగ్ కూడా ఉందని గుర్తించడం ముఖ్యం.


Click it and Unblock the Notifications








