భాయ్‌ఫ్రెండ్ న్యూడ్ ఫోటోలను అప్‌లోడ్ చేసింది!

Posted By:

తన ప్రియుడు తనను పట్టించుకోవడం లేదన్న కారణంతో ఓ యువతి నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి తన భాయ్ ఫ్రెండ్ ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్నంగా అప్‌లోడ్ చేసింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో తన ఫొటోను ఇలా చూసుకున్న ఆమె ప్రియుడు ఒక్కసారిగా బిత్తరపోయాడు. వెనువెంటనే అతడు సైబర్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితురాలిని గుర్తించారు.

భాయ్‌ఫ్రెండ్ న్యూడ్ ఫోటోలను అప్‌లోడ్ చేసింది!

సోషల్ మీడియా సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించినట్లయితే...దేవేశ్ శర్మ ఓ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అతనికి తన స్నేహితుల ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆమె సోదరి(23)కి తన కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువతికి హామీ  ఇచ్చాడు. ఈ క్రమంలో అతనితో యువతికి స్నేహం పెరిగింది. దీంతో నగరాన్ని చూపెట్టాలని, పార్టీలకు తీసుకెళ్లాలని ఆమె దేవేశ్‌ను కోరేది. తన పాఠశాల చదువు ముగించిన తర్వాత ఆమె తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి లక్నోకు వచ్చినట్లు ఆమె తనకు చెప్పినట్లు దేవేశ్ తెలిపాడు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ఆగస్టు 3న ఓ పార్టీకి వెళ్లేముందు తనకు రూ. 4,500 హ్యాండ్‌బ్యాగ్, రూ. 9000 విలువైన మినీ స్కర్ట్ కొనివ్వాలని ఆ యువతి తనను అడిగిందని.. అందుకు తాను నిరాకరించానని దేవేశ్ తెలిపాడు. ఆనాటి నుంచి మళ్లీ ఆమెను కలువలేదని చెప్పాడు. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ద్వారానే మాట్లాడుకున్నామని తెలిపాడు.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆమె ఖరీదైన కోర్కెలు తీర్చలేక అతడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆగస్టు 4న సుమారు 100 సార్లు అతనికి ఆ యువతి ఫోన్ చేసింది. అంతేగాక తన డిమాండ్లను తీర్చాలని 50 బెదిరింపు సందేశాలు అతనికి పంపించింది. తనకు రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తన దగ్గర లేవని దేవేశ్ చెప్పడంతో రూ. 20వేలు డిపాజిట్ చేయాలని ఆమె తన బ్యాంక్ ఖాతా నెంబరు అతడికి ఇచ్చింది. ఈ వివరాలన్నీ పోలీసులకు ఇచ్చినట్లు దేవేశ్ తెలిపాడు. ఆ తర్వాతి రోజు నుంచి దేవేశ్ ఆమె ఫోన్ కాల్స్‌ను లిప్ట్ చేయడం మానేశాడు.

అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా ఫేస్‌బుక్ నకిలీ ఖాతా ద్వారా పోస్టు చేయడంతో దేవేశ్ తీవ్రంగా కలత చెందాడు. ఫేస్‌బుక్‌లో అతడి ఫోన్ నెంబర్ ఇవ్వడంతోపాటు ఫేస్‌బుక్‌లో అతడిని ‘గే' గా చిత్రీకరించింది ఆ యువతి. దీంతో షాక్ గురైన దేవేశ్.. ఆగస్టు 8న సైబర్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితురాలిని గుర్తించారు. అయితే దేవేశ్‌కు ఫోన్ చేసిన నిందిత యువతి క్షమాపణలు కోరింది. దీంతో అతడు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరలేదు. తనలాగే ఇతరులను కూడా ఆ యువతి వేధిస్తుందేమోనని చెప్పిన దేవేశ్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపాడు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇన్స్‌పెక్టర్ ఎస్సీ మాల్వియా నిందితురాలిది మాన్యక్ నగర్‌గా గుర్తించారు. భాయ్‌ఫ్రెండ్‌ను వేధింపులకు గురి చేసిన ఘటనల్లో ఈ ఘటన చాలా విచిత్రంగా ఉందని మాల్వియా అభిప్రాయపడ్డారు.

English summary
Girl posts nude pictures of ‘boyfriend’ on Facebook. Read more in Telugu Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting