జర్నలిస్ట్ అత్యుత్సాహం: మోడీ సౌదీ రాజు కాళ్లు మొక్కారా..

Written By:

ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటనలో ఉన్న సమయంలో ఆ దేశపు రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లా అల్ జిద్ సౌద్ కాళ్లు మొక్కారని చూపుతూ సీఎన్ఎన్-ఐబీఎన్ జర్నలిస్టు ఓ సంచలన ఫోటోను పోస్టు చేశారు. ఇంతకు ముందు అద్వానీ కాళ్లకు నమస్కరిస్తున్న ఫోటోను తీసుకుని దాన్ని మార్ఫింగ్ చేసిన ఫోటోను ఈ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది.

Read more: షేక్‌స్పియర్ అతడు కాదు..గర్భాన్ని దాల్చిన అమ్మాయి: షేకయ్యే నిజాలు

జర్నలిస్ట్ అత్యుత్సాహం: మోడీ సౌదీ రాజు కాళ్లు మొక్కారా..

అది మార్ఫింగ్ ఫోటో అని తెలియని నెటిజన్లు మోడీ భారత్ పరువు తీసారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విషయం తెలుసుకున్న తరువాత ఆ జర్నలిస్ట్ పై బిజెపి కేసు నమోదుచేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ రాఘవ్ చోప్రా తెలియక దానిని పోస్ట్ చేశానని ఇది పెద్ద పొరపాటని మన్నించాలని కోరారు. దీనిపై ట్విట్టర్ లో విమర్శలు మొదలయ్యాయి. వీటికి సీఎన్ఎన్-ఐబీఎన్ సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Read more : పాన్‌కార్డ్‌ పొందడం మరింత తేలిక

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఎవరో మార్ఫింగ్ చేసిన ఫోటోను జర్నలిస్ట్ సిగ్గు చేటంటూ తన వాల్ లో పోస్ట్ చేశారు. 

2

రాఘవ్ చోప్రా అనే జర్నలిస్ట్ ఈ పని చేశారు. ఆ తరువాత పెద్ద తప్పయింది మన్నించడంటూ మళ్లీ పోస్ట్ పెట్టారు. 

3

దీనిపై సీఎన్ఎన్-ఐబీఎన్ సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

4

సోషల్ మీడియాలో దీనిపై ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి. 

5

సోషల్ మీడియాలో విమర్శలు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write BJP files complaint for posting a morphed picture of Modi on social media
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot