అరచేతిలో వైకుంఠం..?

Written By:

ఏ విధమైన ప్రభుత్వ సబ్సిడీ లేకుండా రూ.251కే తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించటంతో మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. యువత నిద్రలు మానుకుని మరి ఈ ఫోన్‌లను బుక్ చేసుకునేందుకు ఎగబడ్డారు. తీరా చూస్తే పరిస్థతి కాస్తా అడ్డం తిరిగింది. రూ.251కు గొప్ప ఫోన్ వస్తుందని భ్రమపడిన వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయి. ఆరంభం నుంచి రూ.251 స్మార్ట్‌ఫోన్ పై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

Read More : ప్రపంచం నాశనమైపోయినా.. ఈ డిస్క్‌లోని డేటా సేఫ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లక్షల మంది ఆసక్తి చూపారు

అంతా మాయేనా..?

గురువారం ఉదయం 6 గంటల నుంచీ తమ వెబ్‌సైట్లో ఫ్రీడమ్ 251 ఫోన్‌లను బుక్ చేసుకోవచ్చని రింగింగ్ బెల్స్ చెప్పటంతో ఈ కారుచౌక ఫోన్‌ను కొనేందుకు లక్షల మంది ఆసక్తి చూపారు.

వెబ్‌సైట్ మెరాయించటంతో

అంతా మాయేనా..?

ఫ్రీడమ్ 251 వెబ్‌సైట్ మెరాయించటంతో ఒకటికి పది సార్లు ప్రయత్నించిన ‌నెటిజనులు విసిగి వేసారి పోయారు.

30వేల బుకింగ్‌లు తీసుకున్నామని చెబుతోంది

అంతా మాయేనా..?

ఇక రింగింగ్‌బెల్స్ సంస్థ మాత్రం... 30వేల బుకింగ్‌లు తీసుకున్నామని చెబుతోంది. అయితే, ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నట్లు ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పేర్కొనక పోవటం విశేషం.

ధ్రువీకరణ లేకండా

అంతా మాయేనా..?

భారత ప్రమాణాల మండలి (బీఐఎస్) ధ్రువీకరణ లేకండా ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్‌లను మార్కెటింగ్ చేయటం పై టెలికామ్ శాఖ రింగింగ్ బెల్స్ సంస్థను వివరణ కోరినట్లు తెలుస్తోంది.

పరిశీలన జరపాలని కేంద్రానికి లేఖ

అంతా మాయేనా..?

2015లో రిజిస్టర్ అయిన రింగింగ్ బెల్స్ సంస్థ స్థితిగతుల పై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య కమ్యూనికేషన్ శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్‌కు లేఖ రాసారు.

అన్ని ఫోన్లు ఏలా తీసుకువస్తుంది..?

అంతా మాయేనా..?

ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఒక శాంపిల్ ఫోన్‌ను కూడా అందుబాటులో ఉంచుకోకుండా వేరొక కంపెనీ (Adcom) ఫోన్‌లను చూపటం పట్ల జనంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలల వ్యవథిలో లక్షల ఫోన్‌లను రింగింగ్ బిల్స్ ఏలా తయారు చేయగలదన్న సందేహాలు బలపడుతున్నాయి.

ఆది నుంచి అనుమానాలే

అంతా మాయేనా..?

ఫ్రీడర్ 251 ఫోన్ ప్రారంభం నుంచే అనేక అనుమానాలకు తావిచ్చింది. చివరకు అదే అనుమానాలను మరింతగా బలపర్చింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BJP MP raises concerns over Freedom 251 offer. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot