యువత కోసం బిజెపి 'యువ టివి ఛానల్'

Posted By: Staff

యువత కోసం బిజెపి 'యువ టివి ఛానల్'

 

ఇండియాలో రాజకీయ పార్టీలలో ఒకటైన 'భారతీయ జనతా పార్టీ' ఇండియాలో ఉన్న యువతని ఉత్సాహా పరచేందుకు గాను ఓ సరిక్రొత్త ఇంటర్నెట్ టివి ఛానల్‌ని ప్రారంభించింది. ఈ ఇంటర్నెట్ టివి ఛానల్ పేరు 'యువ'. ఈ టివి ఛానల్ ద్వారా ఇండియాలో ఉన్న యువతకు రాజకీయాలు, అర్దశాస్త్రం, కరెంట్ ఎపైర్స్ మొదలగున వాటికి సంబంధించిన  విషయాలను తెలియచేయనున్నట్లు తెలిపారు.

యువ టివి ఛానల్ సాయంత్రం 5PM నుండి 7 PM వరకు కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు సిద్దంగా ఉంది. ఈ కార్యక్రమాలను భారత దేశ యువత

www.yuva4india.tv ద్వారా వీక్షించవచ్చు. ఈ టివి ఛానల్‌లో బిజెపి వివిధ రాజకీయ ర్యాలీలకు సంబంధించిన వివరాలతో పాటు మరిన్ని కార్యక్రమాలను కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కొత్త ఛానల్‌ని ప్రారంభంచడం వల్ల భారత యువతకు భారతీయ జనతా పార్టీ టెక్ తెలుసుకొనడమే కాకుండా.. యూత్‌కు పరిజ్ఞానాన్ని కూడా అందిస్తుందని అన్నారు.

Read In English

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు తెలిపిన విషయాల మేరకు భారత దేశం యొక్క సమస్యలను తెలుసుకోని వాటిపై యువత సమర్దవంతంగా పాల్గొనేందుకు సమాచారం, జ్ఞానాన్ని యువ టివి అందిస్తుందని అన్నారు. గత సంవత్సరం ఇదే విధమైన టెక్ చొరవ చూపి బిజెపి విరాళాల కోసం  వివిధ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మద్దతుదారుల కోసం ఉపయోగించిన విధానాన్ని గుర్చు చేశాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot