BJP websiteలో భ్రీప్ వంటకాలు,మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారం

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వెబ్‌సైట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులతో సహా బిజెపి నేతలు విస్తుపోయారు. ఢిల్లీ బిజెపి అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ వెబ్‌సైట్‌లో ఏకంగా బీఫ్ వం

|

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వెబ్‌సైట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులతో సహా బిజెపి నేతలు విస్తుపోయారు. ఢిల్లీ బిజెపి అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ వెబ్‌సైట్‌లో ఏకంగా బీఫ్ వంటకాలను ప్రమోట్ చేశారు.అసలు కథనంలోకి వెళ్తే బీజేపీకి చెందిన ఢిల్లీ విభాగపు వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు.

 
BJP websiteలో భ్రీప్ వంటకాలు,మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారం

బీఫ్ వంటకాలను ఈ సైట్లో కనిపించేలా చేశారు. సైట్‌లో పేర్లు కూడా మార్చేశారు. అదే రోజు ఒకవైపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకరం జరుగుతుండటం గమనార్హం. అప్రమత్తమయ్యేసరికే వైబ్ సైట్ అంతా బిజెపి వంటకాలతో నిండిపోయింది.

 ప్రత్యేకమైన ట్యాబ్‌లో

ప్రత్యేకమైన ట్యాబ్‌లో

హ్యాకర్ వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన ట్యాబ్‌లో బీఫ్ వంటకాలను పోస్ట్ చేశాడు. బీఫ్ వంటకాల్లో బీఫ్ ఫ్రై, బీఫ్ డ్రై ఫ్రై, బీఫ్ కర్రీ వంటి వివిధ వంటకాలు కనిపించాయి. సైట్‌ పేజ్ మొత్తం వంటకాలతో నిండిపోయింది.హ్యాకర్లు అలాగే ఒక మెసేజ్ కూడా కనిపించేలా చేశారు. ఇందులో ‘హ్యాక్‌డ్ బై షావో వీ1పీ3ఆర్' అని ఉంది.

ఇదే తొలిసారి కాదు

ఇదే తొలిసారి కాదు

బీజేపీ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురికావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ హ్యాకింగ్ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన సెక్యూరిటీ రీసెర్చర్ ఇలియట్ అల్డర్సన్ సైట్ హ్యాకింగ్ విషయాన్ని ట్వీట్ ద్వారా బీజేపీకి తెలియజేశారు. తర్వాత బీజేపీ అప్రమత్తమై వెబ్‌సైట్‌ను సాధారణ స్థాయికి తీసుకువచ్చింది.

 బిజెపి గోవా యూనిట్‌ వెబ్‌సైట్‌
 

బిజెపి గోవా యూనిట్‌ వెబ్‌సైట్‌

గతేడాది గోవా లో బిజెపి గోవా యూనిట్‌ వెబ్‌సైట్‌ను గుర్తు తెలియని వ్యక్తుల చేత హ్యాకింగ్‌ కు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది హ్యాక్‌ కు గురైన తరువాత 'పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని పోస్ట్‌ చేశారు. వెబ్‌ పేజీలో 'మహ్మద్‌ బిలాల్‌ అని వ్యక్తిగత పేరును పోస్ట్‌ చేసినట్లు, తరువాత హ్యాక్‌కు గురైనట్లు తెలిపారు.

ఎలాంటి వివరాలు

ఎలాంటి వివరాలు

అయితే బిజెపికి చెందిన ఐటి సెల్‌ తెలియచేస్తూ హ్యాకింగ్‌ కు గురైనది పాత వెబ్‌సైటని, దాని స్థానంలో ఎవరు హ్యాక్‌ చేయని విధంగా నూతన సాంకేతిక రక్షణతో కొత్త వెబ్‌సైట్‌ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబర్‌ ఎటాక్‌ వలన ఎలాంటి వివరాలు బయటపడలేదని గోవా బిజెపి ప్రధాన కార్యదర్శి సదానంద్‌ తనావడే తెలిపారు. అయితే సైబర్‌ ఎటాక్‌ జరిగినట్లు పార్టీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

 నరేంద్ర మోడీకు చెందిన మేమ్స్‌

నరేంద్ర మోడీకు చెందిన మేమ్స్‌

ఈ ఏడాది మార్చిలో బిజెపికి చెందిన వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయంపై కొందరు సోషల్‌ మీడియా యూజర్లు రిపోర్ట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకు చెందిన మేమ్స్‌ను పోస్ట్‌ చేశారని సదరు యూజర్లు వాటి స్క్రీన్‌షాట్లను బయటపెట్టారు. సోదరులారా? నేను మిమ్మల్ని ఫూల్‌ను చేశాను?. ఇంకా ఇలాంటివి చాలా రానున్నాయి ? అని మోడీ అన్నట్లుగా ఈ మేమ్స్‌ పోస్ట్‌ చేశారు.

మెయింటెనెన్స్‌ పని నడుస్తున్నదని

దీనిపై తక్షణమే స్పందించిన బిజెపి తమ వెబ్‌సైట్‌ను నిలిపేసింది. ఆ సైట్‌ను తెరవడానికి ప్రయత్నిస్తుంటే, మెయింటెనెన్స్‌ పని నడుస్తున్నదని, త్వరలోనే తిరిగి ప్రజల ముందుకు వస్తామన్న సందేశం కనిపిస్తున్నది. అంతకుముందు నెలలో చత్తీస్‌గఢ్‌ బిజెపికి చెందిన వెబ్‌సైట్‌ కూడా హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఇందులో పాకిస్థాన్‌ జెండా కనిపించడం అప్పట్లో దుమారం రేగిన విషయం విదితమే.

 

Best Mobiles in India

English summary
Hackers target BJP website, embed beef recipes during Modi’s swearing-in

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X