Black Friday Sale 2019: భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో షియోమి ప్రోడక్ట్స్
కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా టీవీలను డిస్కౌంట్ ధర వద్ద కొనలేకపోయాము అన్న బాధలో ఉన్నారా? దీపావళి మరియు దసరా సమయాలలో డబ్బులు సరిపోకనో లేదా సమయం లేక డిస్కౌంట్ ఆఫర్లను వదులుకొని ఉంటే కనుక అలాంటి వారి కోసం ప్రముఖ చైనా సంస్థ షియోమి ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే అనే పేరుతో మరొక సేల్ ను ప్రకటించింది.

భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో మరో 'బ్లాక్ ఫ్రైడే సేల్'ను షియోమి తొందరలో తన ఈ-కామెర్స్ వెబ్సైట్ లో అద్భుతంగా ప్రారంబించబోతోంది. ఈ సేల్స్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు జరగనుంది. షియోమి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయిన Mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ జరగనుంది. అయితే నాలుగురోజులు సేల్ ఉంటుందని ప్రకటించిన షియోమి సంస్థ ఇందులో అందించే డీల్స్ మాత్రం రివీల్ చేయలేదు. సేల్స్ ప్రారంభానికి రెండు మూడు రోజుల ముందు డీల్స్ గురించి క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

అసలు ఈ 'బ్లాక్ ఫ్రైడే సేల్' అంటే ఇండియాలో వున్న వారికి కొత్తగా ఉండవచ్చు కానీ అమెరికా వంటి దేశంలో ఇది సర్వసాధారం. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి ముందు వారం శుక్రవారం ఈ సేల్ జరుగుతుంది. 4. అమెరికాలో ప్రతీ సంవత్సరం నవంబర్‌లో నాలుగో గురువారం థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు అమెరికన్లు. ఆ రోజు వారికి జాతీయ సెలవు దినం. క్రిస్మస్ రాకను సూచిస్తూ శాంటా క్లాజ్ పరేడ్స్ జరుగుతుంటాయి. పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను అడ్వర్‌టైజ్ చేసుకునేందుకు ఈ పరేడ్లను స్పాన్సర్ చేస్తుంటాయి.

బ్లాక్ ఫ్రైడే సేల్ రోజున ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు షాపింగ్స్ ద్వారా లాభం లభిస్తుంది. ప్రతి షాప్ వారు క్రిస్మస్ పండుగ సంబరాలు జరుపుకోవడానికి కావలసిన వస్తువులతో కొనుగోలుదారులను స్వాగతిస్తారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ సేల్ నిర్వహిస్తున్నారు. 11. సేల్ ఏదయితేనేమి మనం కొనాలనుకున్న ప్రొడక్ట్ తక్కువ రేట్‌కు వస్తుందంటే అది మంచి విషయం కదా. కాబట్టి ఇండియాలో బ్లాక్ ఫ్రైడే సేల్ రోజున ఏమైనా మంచి ఆఫర్స్ ఉంటే దానిని మనం క్యాష్ చేసుకోవచ్చు.

దసరా, దీపావళి సేల్‌ను బాగానే ఉపయోగించుకున్న షియోమి సంస్థ ఇప్పుడు 'బ్లాక్ ఫ్రైడే సేల్'ను కూడా అంతే ఘనంగా నిర్వహించే అవకాశముంది. ఇప్పటికే ఇండియాలో రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్, శామ్సంగ్ లాంటి కంపెనీలతో గట్టి పోటీ ఎదుర్కొంటున్న షియోమి 'బ్లాక్ ఫ్రైడే సేల్'లో తన స్మార్ట్ ఫోన్,టీవీలపై భారీ ఆఫర్లను అందించే అవకాశముంది.

షియోమి జరుపుతున్న ఈ సేల్‌లోనే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ లేదా 75 అంగుళాల రెడ్‌మీ టీవీను ఇండియాలో లాంఛ్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న రెడ్‌మీ ఫోన్లు, ఎంఐ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందించే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications








