అమెజాన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్స్...వీటి మీద 60% వరకు తగ్గింపు ఆఫర్స్

|

బ్లాక్ ఫ్రైడే 2019 సేల్స్ ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్‌లో ప్రారంభించబడింది. ఈ రోజు ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సుదీర్ఘ అమ్మకంలో కొనుగోలుదారులు వివిధ బ్రాండ్ల యొక్క మొబైల్ ఆక్సిసరీస్ లమీద గొప్ప తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు. అమ్మకంలో భాగంగా అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తుల మీద అమెజాన్ ఇ-కామెర్స్ 60% వరకు డిస్కౌంట్ అందిస్తున్నది. వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

ఒరైమో
 

--- ఒరైమో డ్యూయల్ యుఎస్‌బి ఫాస్ట్ ఛార్జర్‌ యొక్క అసలు ధర రూ.699 దీని మీద రూ.370 తగ్గింపు తరువాత దీనిని ఇప్పుడు కేవలం రూ.329లకు కొనుగోలు చేయవచ్చు. ఇది 2 యుఎస్‌బి పోర్ట్‌లను కలిగి ఉండి 10.5 వాట్ల విద్యుత్ ఉత్పత్తితో వస్తుంది.

ట్రిబిట్ ఎక్స్‌ఫ్రీ

--- ట్రిబిట్ ఎక్స్‌ఫ్రీ ట్యూన్ బ్లూటూత్‌ యొక్క అసలు ధర రూ.4,999లు . కానీ ప్రస్తుతం జరుగుతున్న బ్లాక్ ఫ్రైడే సేల్స్ లో దీనిని కేవలం 3,299 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక ఒక ఛార్జ్ మీద 40 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. ఇది అంతర్నిర్మిత మైక్‌ను కలిగి ఉంటుంది. ఇప్పుడు దీనిని కొనుగోలు చేయడం ద్వారా 1,700 రూపాయలు ఆదా చేయవచ్చు.

గూగుల్ పేలో బంగారాన్ని మార్చుకొనే క్రొత్త ఫీచర్‌ దీనిపై ఓ లుక్ వేయండి

Ugreen

---- Ugreen lightning to USB cable charging cord యొక్క అసలు ధర రూ.2,999 లు. ఇది MFI సర్టిఫికేట్ ను కలిగి ఉంది. ఇప్పుడు దీనిని అమెజాన్ లో కేవలం రూ.889ల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది ఐఫోన్ 8, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 5 ఎస్, ఐఫోన్ 5, ఐప్యాడ్ మినీ, మినీ 2 మరియు ఐప్యాడ్ ఎయిర్ లకు అనుకూలంగా ఉంటుంది.

Realme 5s: బ్రహ్మాండమైన ఆఫర్లతో రియల్‌మి 5S మొదటి సేల్స్

ఒరైమో టోస్ట్ -8 8000mAh పవర్ బ్యాంక్
 

---- ఒరైమో టోస్ట్ -8 8000mAh పవర్ బ్యాంక్ యొక్క అసలు ధర రూ.1,899. కానీ ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ కేవలం రూ.499లకు లభిస్తుంది. ఈ సేల్ లో దీని అసలు ధరపై రూ.1,400 తగ్గింపు లభించింది. ఈ పవర్ బ్యాంక్ ఎల్‌ఈడీ టార్చ్, మల్టీ ప్రొటెక్ట్ సేఫ్టీ సిస్టమ్‌తో వస్తుంది.

Mi TV 4X 55-inch 2020 ఎడిషన్‌ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

ముజిలి జి 4 బ్లూటూత్ ఇయర్ ఫోన్‌

--- ముజిలి జి 4 బ్లూటూత్ ఇయర్ ఫోన్‌ల యొక్క అసలు ధర రూ.5,999లు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సేల్ లో రూ.2,100ల తగ్గింపు పొందిన తరువాత ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్‌లు కేవలం 3,899 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్ వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.0 ను కలిగి ఉంది మరియు ఇవి ఐపిఎక్స్ 7 రేట్ చేయబడ్డాయి.

లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందించే ఏకైక DTH ఆపరేటర్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

Aukey

--- Aukey 4.8A dual USB car charger adapter యొక్క అసలు ధర రూ.1,499. ప్రస్తుత అమ్మకంలో రూ.1,001ల తగ్గింపు పొందిన తరువాత ఈ కార్ ఛార్జర్‌ కేవలం రూ.448 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో రెండు యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. దీని ద్వారా 5V అవుట్‌పుట్‌తో ఒకేసారి రెండు పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.

ఒరైమో

--- ఒరైమో ఫెదర్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ యొక్క అసలు ధర రూ.1,699. ఇప్పుడు దీని అసలు దారపై 59% తగ్గింపు పొందిన తరువాత ఇది ప్రస్తుతం అమెజాన్‌లో రూ.699 లకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌ఫోన్‌లు ఒక ఛార్జ్ మీద 6 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి.

సువో జెన్ అడాప్టర్‌

--- ఈ సువో జెన్ అడాప్టర్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో 399 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దాని అసలు ధర రూ. 970. ఇప్పుడు దీని మీద సుమారు 59% ఆఫ్ లభిస్తున్నది. ఇది మైక్రో యుఎస్‌బి టు యుఎస్‌బి టైప్-సి అడాప్టర్, ఒటిజి మరియు డేటా ట్రాన్స్ఫర్ అడాప్టర్‌.

Most Read Articles
Best Mobiles in India

English summary
Black Friday Sale Live on Amazon: Check The Mobile Accessories Offers Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X