ఫోటో లీక్... మ్యాటర్ హల్‌చల్!

Posted By: Super

ఫోటో లీక్... మ్యాటర్ హల్‌చల్!

 

ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్ ఎన్4బిబి (N4BB) బ్లాక్‌బెర్రీకి చెందిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫోటోను లీక్ చేసింది. ‘లండన్ ’ అనే కోడ్‌నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ఎల్ సిరీస్ టచ్‌స్ర్కీన్ హ్యాండ్‌సెట్ బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. బీబీఎమ్, డాక్స్ టూ గో, ఫేస్‌బుక్, స్టోరీ మేకర్ వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు సమాచారం. బ్లాక్‌బెర్రీ లండన్‌గా పేర్కొనబడుతున్న ఈ అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అదేవిధంగా 1 జీబి ర్యామ్, 16జీబి ఆన్‌బోర్డ్ మెమరీతో పాటు 8 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరాను నిక్షిప్తం చేసినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించి ఓ మసక వీడియోను BlackBerryItalia.it నుంచి సేకరించటం జరిగింది. సిమ్ ఇన్స్‌స్టాలేషన్‌కు సంబంధించిన దృశ్యాన్ని ఈ వీడియో టేప్‌లో చూడొచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు సెప్టంబర్ 25 నుంచి 27 వరకు శాన్ జోస్‌లో జరిగే ‘రిమ్స్ జామ్ అమెరికాస్ కాన్ఫిరెన్స్’లో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీడియో యూఆర్ఎల్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot