మేమూ తక్కువ ఖరీదు గల స్మార్ట్ ఫోన్స్ అందిస్తాం: బ్లాక్‌బెర్రీ

Posted By: Super

మేమూ తక్కువ ఖరీదు గల స్మార్ట్ ఫోన్స్ అందిస్తాం: బ్లాక్‌బెర్రీ

 

మొబైల్ మార్కెట్లో ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకునేందుకు గాను త్వరలో అన్ని మొబైల్ సంస్దలు నిర్మాణాత్మక మార్పులు తీసుకున్నారు. ఇందులో భాగంగా బ్లాక్ బెర్రీ మొబైల్ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ ఓ అడుగు ముందుకేసి గతంలో మాదిరి రూ 20,000 ధర కలిగిన స్మార్ట్ ఫోన్స్‌కి స్వస్తి చెప్పనున్నట్లు ప్రకటించారు. రాబోయే కాలంలో రీసెర్చ్ ఇన్ మోషన్ రూపొందించే మొబైల్ ఫోన్స్ ధరలు రూ 15,000లోపే ఉండనున్నాయని అధికారకంగా ప్రకటించారు.

త్వరలో రీసెర్చ్ ఇన్ మోషన్ విడుదల చేయనున్న హ్యాండ్ సెట్ ధర రూ 15, 000 లోపే ఉండనుందని సమాచారం. బ్లాక్ బెర్రీ మొబైల్స్‌ని ఉపయోగించే కస్టమర్స్‌లలో 30శాతం మంది సాధారణ వినియోగదారలు కాగా, 70 శాతం మంది కస్టమర్స్ బిజినెస్‌కి సంబంధించిన వారు కావడం గమనార్హం అని అన్నారు. ఇటీవల మార్కెట్లోకి బ్లాక్ బెర్రీ విడుదల చేసిన బ్లాక్ బెర్రీ కర్వ్ 9360, బ్లాక్ బెర్రీ కర్వ్ 9380 స్మార్ట్ ఫోన్స్ ధరలు రూ 20,000గా నిర్ణయించారు.

అంతేకాకుండా యువకులను స్మార్ట్ ఫోన్స్ వైపుకి ఆకర్షించే భాగంలో రీసెర్చ్ ఇన్ మోషన్ టెలికమ్ ఆపరేటర్స్‌తో కలసి సంయుక్తంగా పనిచేయనుంది. ఇటీవలే బ్లాక్ బెర్రీ తక్కువ ఖరీదు కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్న మైక్రోమ్యాక్స్, మోటరోలా, ఎల్‌జీ, సోనీ ఎరిక్సన్, శాంసంగ్ ఉత్పత్తుల నుండి ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు గాను చురుకైన ప్రచారాన్ని కూడా నిర్వహించింది.

బ్లాక్ బెర్రీ ప్రస్తుతం ఎక్కడో పోయిందో అక్కడే వెతకాలి అనే సామెత ద్వారా కంపెనీ ఇప్పుడు ఎంటర్‌ప్రైజ్ మొబైల్ పరిష్కారాలను కనుగొనడమే కాకుండా, ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు ఒక మంచి అనుభవాన్ని అందించడానికి అధునాతన స్థాయి స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసేందుకు పనిచేస్తుంది. ఇందులో భాగంగా రీసెర్చ్ ఇన్ మోషన్ ఇండియా గవర్నమెంట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot