బ్లాక్ బెర్రీ “కీ వన్” లిమిటెడ్ ఎడిషన్ను ప్రారంభం!

Posted By: Madhavi Lagishetty

2017 ఆగస్టు 1న ఇండియాలో బ్లాక్ బెర్రీ KEYONE మోడల్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఈ కెనడియన్ కంపెనీకి చెందిన ఫోన్ కేవలం బ్లాక్ కలర్లో మాత్రమే లభించింది. అయితే బంగ్లాదేశ్లో లిమిటెడ్ బ్లాక్ ఎడిషన్ కీవన్ ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇండియాలో బ్లాక్ బెర్రీ కీవన్ సక్సెస్ అయ్యింది. దీంతో సంస్థ బంగ్లాదేశ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కూడా తమ సత్తా చాటాలని నిర్ణయించుకుంది.

బ్లాక్ బెర్రీ “కీ వన్” లిమిటెడ్ ఎడిషన్ను ప్రారంభం!

బ్లాక్ బెర్రీ కీ వన్ బ్లాక్ ఎడిషన్ డ్యుయల్ సిమ్ స్లాట్, మెటాలిక్ బ్లాక్ ఫేమ్ తో మెత్తటి టచ్ ఫ్రేమ్ రేర్ తో వస్తుంది. కీవన్ 443 పిపిఐ లెక్కింపులో 1080,1620పిక్సల్స్ ,4.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ క్రిస్ప్ గా ఉంటుంది. స్టాండర్ట్ కీ బోర్డు ఫీచర్ను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా బ్లాక్ బెర్రీ సీరీస్ లో మాత్రమే కనిపిస్తుంది.

4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రో ఎస్డి కార్డు ద్వారా 2టిజి వరకు విస్తరించుకోవచ్చు. డివైస్ స్నాప్ డ్రాగెన్ 625 , 2గిగా ప్రొసెసర్తో 4జిబి ర్యామ్ తో కలిసి మల్టీ టాస్కింగ్ గా పనిచేస్తుంది.

బ్లాక్ బెర్రీ కీ వన్ మెయిన్ అట్రాక్షన్ ఫీచర్ QWERTY కీ ప్యాడ్. 4.5అంగుళాల డిస్ప్లేతోపాటు QWERTYకీబోర్డు ఫోన్ను అట్రాక్టివ్ గా కనిపించేలా చేస్తుంది. కీబోర్డు 52 అనుకూలీకరణ మార్గాలను ప్రారంభించటానికి అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ 7.0నౌగట్ వెర్షన్ తో రన్ అవుతుంది.

మళ్ళీ ఆ రెండింటికి ఝలక్, 2 రోజులకే జియో ప్లాన్లలో మార్పు, జోరులో అధినేత !

ఇక సెక్యూరిటీ కోసం బ్లాక్ బెర్రీ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో KEYONEని పొందుపరచబడింది. ఇది కీబోర్డ్ మీద స్పేస్ బార్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. బ్లాక్ బెర్రీ దాని ఛార్జింగ్ ఫీచర్ను కూడా మెరుగుపరిచింది. కీవన్ పవర్ తో 3505ఎంఏహెచ్ బ్యాటరీ మరియు క్విక్ ఛార్జ్ 3.0సపోర్టు చేస్తుంది.

బ్లాక్ బెర్రీ కీవన్ ఇతర ఇంట్రెస్టింగ్ ఫీచర్లతో ఒకటి బ్లాక్ బెర్రీ హబ్. ఇది ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, BBM, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇ మెయిల్స్ టెక్స్ట్, మెసేజ్ ల కోసం ప్రత్యేక ఫోల్డర్ను క్రియేట్ చేస్తుంది.

లిమిటెడ్ స్టాక్ బ్లాక్ ఎడిషన్ బ్లాక్ బెర్రీ కీవన్ బంగ్లాదేశ్ లో ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ ఎడిషన్ ఇతర దేశాల్లో లాంచ్ అవుతుందా లేదా అనేది ఇంకా నిర్ధారించలేదు.

English summary
Optiemus and BlackBerry collabrates to launch KEYone limited Black Edition in Bangladesh. KEYone has 4GB RAM and 64GB interal memory which isexpandable via microSD card.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot