జర్నన్ కంపెనీ స్కోర్‌లూప్‌‌ని హాస్తగతం చేసుకున్న బ్లాక్‌బెర్రీ

Posted By: Super

జర్నన్ కంపెనీ స్కోర్‌లూప్‌‌ని హాస్తగతం చేసుకున్న బ్లాక్‌బెర్రీ

టోరెంటో: బ్లాక్ బెర్రీ తయారీదారు సంస్ద అయినటువంటి రిమ్(రీసెర్చ్ ఇన్ మోషన్) జర్నన్ కంపెనీ స్కోర్‌లూప్‌ని స్వాధీనం చేసుకుంది. జర్నన్ కంపెనీ అయిన స్కోర్‌లూప్‌ మొబైల్ గేమ్స్‌కి సంబంధించినటువంటి సోషల్ ఫీచర్స్‌ని టూల్ కిట్స్‌ని డెవలప్ చేస్తుంది. ఐతే ఫైనాన్సియల్ టర్మ్స్ మాత్రం పూర్తి అవ్వలేదని మాత్రం రిమ్ వెల్లడించింది. ఈ డీల్ వల్ల బ్లాక్ బెర్రీ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లో సోషల్ నెట్ వర్కింగ్ ఫీచర్స్ కలగినటువంటి మంచి మంచి గేమింగ్ సర్వీస్‌ని అందించడానికి ఉపయోగపడుతుందని రిమ్ అధికారులు వెల్లడించారు.

రాబోయే కాలంలో స్కోర్‌లూప్‌ టీమ్‌తో కలసి మంచి గేమింగ్ సర్వీస్‌లను అందించడంలో రిమ్ ముందు ఉంటుందని అన్నారు. స్కోర్‌లూప్‌ భాగస్వామ్యంతో బ్లాక్ బెర్రీ ప్లాట్‌ఫామ్‌లో సోషల్ నెట్ వర్కింగ్ ఫీచర్స్‌కి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇక జర్నన్ కంపెనీ అయిన స్కోర్‌లూప్‌ విషయానికి వస్తే 2008లో ప్రారంభించి అనతి కాలంలోనే గేమ్ సర్వీసెస్‌లలో తనదైన ముద్ర వేసింది. మొబైల్ గేమ్స్‌కి సంబంధించి టూల్ కిట్స్, సోషల్ ఎలిమెంట్స్‌ సాప్ట్ వేర్‌ని డెవలప్ చేస్తుంది. స్కోర్‌లూప్‌ రూపోందించినటువంటి గేమింగ్ టూల్ కిట్స్ ఆపిల్ ఐఒయస్, గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఫోన్ 7లలో పని చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot