ఇండియన్ మార్కెట్లోకి రూ 32,000తో వస్తున్న బ్లాక్‌బెర్రీ ప్లేబుక్‌

Posted By: Staff

ఇండియన్ మార్కెట్లోకి రూ 32,000తో వస్తున్న బ్లాక్‌బెర్రీ ప్లేబుక్‌

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌లలో నెలకొన్న పోటీ వాతావరణం..ఇప్పుడు టాబ్లెట్స్‌కు విస్తరించింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలన్నీ టాబ్లెట్స్‌ రూపకల్పనలో నిమగ్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌ మార్కెట్లోకి కుప్పలుతెప్పలుగా రకరకాల ఫీచర్లతో టాబ్లెట్స్‌, ఐపాడ్‌లు వచ్చిపడుతున్నాయి. అయితే బ్లాక్‌ బెర్రీ సంస్థ సైతం ఈ నెలలో ప్లేబుక్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఆపిల్‌, సామ్‌సంగ్‌ సంస్థల ఉత్పత్తులకు పోటీ ఇవ్వనున్న ఈ ప్లేబుక్‌ భారత్‌తోపాటు 16 దేశాలలో విడుదలవనుంది. బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, హాంగ్‌కాంగ్‌, ఆస్ట్రేలియా, అరబ్‌ దేశాలలో త్వరలో విడుదలకానున్న ఈ ప్లేబుక్‌ ధరను మాత్రం ఇంకా బ్లాక్‌ బెర్రీ తయారీ సంస్థ రిసెర్చ్‌ ఇన్‌ మోషన్‌ (రిమ్‌) ఖచ్చితమైన ధరను ప్రకటించలేదు.

అయితే మార్కెట్‌లో ప్రత్యర్థి సంస్థల ఉత్పత్తుల ధరలతో పోల్చితే సమానంగా లేదా తక్కువగానే ఉంటుందని రిమ్‌ వెల్లడించింది. కాగా 16 జిబి నుంచి 64 జిబి సామర్థ్యం లిగిన ప్లేబుక్‌ విలువ భారత్‌లో రూ.22వేల నుంచి రూ.32 వేల మధ్య ఉండే వీలుందని తెలుస్తోంది. మరోవైపు గతేడాది ఏప్రిల్‌ 19న అమెరికా, కెనడా మార్కెట్లలో విడుదలైన ఈ ప్లేబుక్‌ మొదటివారంలో 50వేల ఉత్పత్తులు మాత్రమే అమ్ముడయ్యాయని బ్లాక్‌ బెర్రీ తెలిపింది. అయితే ఐపాడ్‌లతో పోల్చితే అదే సమయంలో విడుదలైన బ్లాక్‌ బెర్రీ టాబ్లెట్స్‌ ఎంతో ఎక్కువగా అమ్ముడయ్యాయని సంస్థ తెలిపింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting