బ్లాక్‌బెర్రీ పోర్చ్ (లక్ష విలువ చేసే లక్షణమైన ఫోన్)!

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ పోర్చ్ (లక్ష విలువ చేసే లక్షణమైన ఫోన్)!

 

బ్లాక్‌బెర్రీ మొబైల్‌ఫోన్‌ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) భారత విపణిలో అత్యాధునికి స్పెసిఫికేషన్‌లతో కూడిన ఖరీదైన హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. పేరు బ్లాక్‌బెర్రీ పోర్చ్ P’9981. ధర రూ.1.39 లక్షలు. ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ డివైజ్‌ను ఎంపిక చేసిన కేంద్రాల ద్వారా ప్రత్యేక ఆర్డర్ల మేరకు విక్రయించనున్నారు. ప్రొఫెషన్‌ల్ హోదాను కలిగి ఉన్నఈ డివైజ్ ప్రధాన ఫీచర్లు...

పోర్చ్ డిజైన్,

బ్లాక్‌బెర్రీ 7.0 ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

768ఎంబీ ర్యామ్,

8జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్ సహకారంతో మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

2.8 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 640x360పిక్సల్స్),

5మెగా పిక్సల్ కెమెరా,

35 బటన్లతో కూడిన బ్యాక్‌లిట్ కీబోర్డ్,

3జీ కనెక్టువీటీ,

వై-ఫై సామర్ధ్యం.

భారత్‌లో బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220!

బ్లాక్‌బెర్రీ ఫోన్ల రూపకర్త రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్), ‘కర్వ్ 9220’ మోడల్‌లో బుధవారం భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.10,990. భారత్ వేదికగా ఇలా అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ను రిమ్ ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. భారత్‌లో దీన్ని ఆవిష్కరించిన సందర్భంగా కర్వ్ 9220 కస్టమర్లు… దాదాపు రూ. 2,500 విలువ చేసే అప్లికేషన్‌లను బ్లాక్‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ముగింపు తేదీ జూన్ 30.

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 ఫీచర్లు:

బ్లాక్ బెర్రీ 7.1 ఆపరేటింగ్ సిస్టం, 2.44 అంగుళాల QVGA డిస్‌ప్లే, క్వర్టీ కీప్యాడ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో రికార్డింగ్ సౌలభ్యత, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి, 512 ఎంబీ ర్యామ్, 3.5mm ఆడియో జాక్, జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, ఎడ్జ్ కనెక్టువిటీ, వై-ఫై సౌలభ్యత, బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లయోన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot