ఇండియాలో బ్లాక్‌బెర్రీ 'బంఫర్ ఆఫర్'...!

Posted By: Prashanth

ఇండియాలో బ్లాక్‌బెర్రీ 'బంఫర్ ఆఫర్'...!

 

బ్లాక్‌బెర్రీ తయారీదారు 'రీసెర్చ్ ఇన్ మోషన్' ఇండియాలో బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్స్ మోడల్స్ ధరలను 26 శాతం తగ్గించింది. ఈ నిర్ణయంతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మెజారిటీ వాటాని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతక ముందు డిసెంబర్ 2011న రీసెర్చ్ ఇన్ మోషన్ బ్లాక్‌బెర్రీ ప్లే బుక్ టాబ్లెట్ ధరని తగ్గించిన విషయం తెలిసిందే.

రీసెర్చ్ ఇన్ మోషన్ సంస్ద ఇప్పుడు ఎంటర్‌ప్రైజ్ డిజైన్ నుండి వినియోగదారుల సాధనంగా మారింది. ధరలు తగ్గించడానికి గల కారణం వినియోగదారులకు బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్స్‌పై ఆసక్తిని కనబర్చేందుకేనని నిపుణులు భావిస్తున్నా రు. దీంతో ఒక్కసారిగా ఇండియాలో ఎక్కువ మొత్తంలో బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్స్‌ని ఉపయోగించే వారి శాతం పెరుగుతుందని బ్లాక్ బెర్రీ అధికారులు తెలియజేశారు.

తగ్గించిన ధరలను బట్టి బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఎంట్రీ లెవల్ మోడలైన బ్లాక్‌బెర్రీ కర్వ్ 8520 స్మార్ట్ ఫోన్ ధర గంతలో రూ 10,900 ఉంటే ఈ ఫోన్‌కి 18 శాతం డిస్కోంట్ ప్రకటిస్తే ప్రస్తుతం ఈ మొబైల్ మార్కెట్లో రూ 8,999కే లభించనుంది. బ్లాక్ బెర్రీ టార్చ్ 9860 స్మార్ట్ ఫోన్‌ ప్రస్తుతం రూ 29,900 ఉండగా 26 శాతం డిస్కౌంట్ ప్రకటించగా.. ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ 21,990కు లభించనుంది.

బ్లాక్ బెర్రీ కర్వ్ 9380 స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర రూ 18,990 ఉండగా... డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత మార్కెట్లో రూ 16,990 లభిస్తుంది. అదే బ్లాక్ బెర్రీ కర్వ్ 9360 స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర రూ 20,990 ఉండగా.. డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత మార్కెట్లో రూ 19,990కు లభిస్తుంది. ఇండియాలో ఎక్కువగా ఈ నాలుగు హ్యాండ్ సెట్స్ అమ్ముడవుతుండడంతో వీటిపై రీసెర్చ్ ఇన్ మోషన్ దృష్టిని నిలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot