విడుదలైన నెల తర్వాత రికార్డుస్దాయి అమ్మకాలు నమోదు చేసిన బ్లాక్‌బెర్రీ

Posted By: Super

విడుదలైన నెల తర్వాత రికార్డుస్దాయి అమ్మకాలు నమోదు చేసిన బ్లాక్‌బెర్రీ

బ్లాక్‌బెర్రీ ఉత్పత్తులను తయారు చేసేటటువంటి రీసెర్చ్ ఇన్ మోషన్(RIM) తను రూపోందించినటువంటి ప్లేబుక్ టాబ్లెట్స్‌‌ని విడుదల చేసిన మొట్టమొదటి నెల తర్వాత 2,50,000 టాబ్లెట్స్‌‌ని అమ్మడం జరిగిందని రిపోర్ట్‌లో వెల్లడించడం జరిగింది. విడుదలకు ముందు ఈ ప్లేబుక్ రివ్యూస్ ఈ ప్రోడక్ట్ మీద చాలా చెత్తగా వ్రాయడం జరిగింది. ఐనాసరే వాటన్నింటిని అధిగమించి ఈరోజు ఇలా అత్యధికంగా అమ్మకాలను నెలకొల్పడం జరిగింది. ఇది ఇలాఉండగా రీసెర్చ్ ఇన్ మోషన్, క్యాపిటల్ మార్కెట్స్ అయినటువంటి రాయల్ బ్యాంక్ కెనడాకి ఈ ప్లేబుక్ గురించిన సమాచారం, అంతేకాకుండా ఈ సంవత్సరం చివరి కల్లా మేము అనుకున్న సేల్ టార్గెట్స్‌ని సాధించడం కూడా జరిగిందని వెల్లడించారు.

గడినటువంటి మూడు మాసాలలో ఐప్యాడ్ అమ్మకాలు 4.69యూనిట్లు అమ్ముడవగా, బ్లాక్‌బెర్రీ టాబ్లెట్ మాత్రం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మోటరోలా జూమ్ టాబ్లెట్ కంటే కూడా అత్యధికంగా అమ్ముడంతో సంతోషంగా ఉన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుమారు 1,000 ప్లేబుక్స్ వరకు రీకాల్ చేసినప్పటికి సేల్స్ మీద ఏమంత ప్రభావం చూపలేకపోయింది. ఇక విశ్లేషకుల అంచనా ప్రకారం టాబ్లెట్ మార్కెట్‌లో 3.9మిలియన్ ప్లేబుక్స్‌ని అమ్మడం జరుగుతుందని, అలా జరిగితే ఈ సంవత్సరం చివరకల్లా దాదాపు మొత్తం 70మిలియన్ టాబ్లెట్స్ వరకు అమ్మకాలు జరుగుతాయని అంచనా...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot