Home
News

రూ.10999 ధర నుంచే కొత్త QLED టీవీలు... ఇవాళ్టి నుంచే బుకింగ్‌ చేసుకోవచ్చు..!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ Blaupunkt నుంచి కీలక ప్రకటన వచ్చింది. భారత్‌ మార్కెట్‌లో QLED గూగుల్‌ టీవీలను లాంచ్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ సిరీస్‌ టీవీలు అత్యంత నాణ్యమైన క్వాలిటీ, బిల్ట్‌ ఇన్‌ డాల్బీ సౌండ్‌ దీంతోపాటు గూగుల్‌ ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌టీవీలు 32 అంగుళాల డిస్‌ప్లే సైజ్ నుంచి 65 అంగుళాల డిస్‌ప్లే సైజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

మొత్తం 5 వేరియంట్స్‌ :
ఈ QLED టీవీలు మొత్తంగా 5 డిస్‌ప్లే సైజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. 32 అంగుళాలు, 40 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాలు డిస్‌ప్లే టీవీలున్నాయి. ఎంట్రీ లెవల్ మోడల్స్‌ను బడ్జెట్‌ యూజర్ల కోసం తీసుకొచ్చింది. అదే భారీ డిస్‌ప్లే కలిగిన మోడల్స్‌ను ప్రీమియం అనుభూతి కోసం లాంచ్ చేసింది.

Blaupunkt QLED Google TVs launched in india sale starts from today via flipkart

HD రిజల్యూషన్‌ :
Blaupunkt QLED టీవీ సిరీస్‌లో 32 అంగుళాల వేరియంట్‌ HD రిజల్యూషన్‌ను కలిగి ఉంది. అదే 40 అంగుళాల వేరియంట్‌ ఫుల్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు మోడల్స్‌ బెజిల్‌ లెస్‌, స్లిమ్‌ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. మరియు గూగుల్‌ అసిస్టెంట్‌, క్రోమ్‌కాస్ట్‌తో కూడిన ఆండ్రాయిడ్ TV OS పైన పనిచేస్తాయి.

ఈ స్మార్ట్‌ టీవీల్లో మరో ప్రత్యేకత ఉంది. ఇవి డాల్బీ డిజిటల్‌ ప్లస్‌ ఆడియో ఆధారిత 48W స్పీకర్‌లను కలిగి ఉన్నాయి. ఫలితంగా మెరుగైన ఆడియో అనుభూతిని పొందుతారని సంస్థ చెబుతోంది. దీంతోపాటు ఈ 32, 40 అంగుళాల స్మార్ట్‌టీవీలు జియోహాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిట్స్‌ వంటి యాప్స్‌ను కూడా సపోర్టు చేస్తాయి.

మెటాలిక్‌ డిజైన్‌ :
మిగిలిన మూడు డిస్‌ప్లే వేరియంట్స్‌ 50, 55, 65 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్‌ బెజిల్‌ లెస్‌ మెటాలిక్‌ డిజైన్‌, డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్‌, 6 ఆడియో విజువల్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. మరియు HDR10, 1.1 బిలియన్‌ కలర్‌ వరకు Colour Gamut సపోర్టును కలిగి ఉంటుంది.

ఈ QLED సిరీస్‌ టీవీల్లో ఆడియో పరంగా మెరుగైన అనుభూతిని పొందవచ్చని సంస్థ చెబుతోంది. QLED 50 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్.. 50W ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అదే 55 అంగుళాల డిస్‌ప్లే, 65 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్స్‌ 70W అవుట్‌పుట్‌ను అందిస్తుంది.

Blaupunkt QLED టీవీ సిరీస్‌ ఆండ్రాయిడ్‌ TV OS పైన పనిచేస్తుంది. 50, 55, 65 మోడల్స్‌ AI PG చిప్‌సెట్‌ మరియు ARM Cortex A55 క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. అదే 32, 40 అంగుళాల టీవీ వేరియంట్స్‌ Realtek ప్రాసెసర్‌లతో పనిచేస్తాయి. కనెక్టివిటీ పరంగా డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌, HDMI, USB వంటి ఫీచర్‌లున్నాయి.

ఈ QLED టీవీ సిరీస్‌ ధర వివరాలను సంస్థ వెల్లడించింది. దీని ఆధారంగా 32 అంగుళాల వేరియంట్‌ ధర రూ.10999 గా ఉంది. అదే 40 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.15499 గా ఉంది. అదే 50 అంగుళాల టీవీ ధర రూ.27999 గా ఉంది.

35 అంగుళాల వేరియంట్ ధర రూ.31999, అదే 65 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.44999 గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ స్మార్ట్‌టీవీలను బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI క్రెడిట్‌ కార్డులు, EMI లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Blaupunkt QLED Google TVs launched in india sale starts from today via flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X