Home
News

బ్లింకిట్ దూకుడు: ఇకపై 10 నిమిషాల్లో ల్యాప్‌టాప్స్‌, ప్రింటర్లు, మరెన్నో ఎలక్ట్రానిక్స్ మీ ఇంటికే!

By Ram Kumar

క్షణాల్లో కిరాణా సరుకులు డెలివరీ చేసే బ్లింకిట్ ఇప్పుడు సరికొత్త అవతారమెత్తింది. ఇన్నాళ్లూ కూరగాయలు, పాలు, పండ్లను అందజేసిన ఈ ఫాస్ట్ డెలివరీ యాప్ ఇకపై ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా మీ ఇంటి వద్దకు జస్ట్ పది నిమిషాల్లోనే చేరవేయనుంది.

ల్యాప్‌టాప్స్‌, మానిటర్లు, ప్రింటర్ల వంటి అత్యాధునిక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా ఇకపై బ్లింకిట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ట్రెడిషనల్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ వీటిని డెలివరీ చేయడానికి రోజుల తరబడి సమయం తీసుకుంటున్నాయి. ఈ కొత్త సర్వీస్‌తో ఆ నిరీక్షణకు తెరపడనుంది.

Blinkit Launches 10-Minute Delivery for Laptops  Monitors  Printers  amp amp  More

ఢిల్లీ-ఎన్‌సిఆర్, పూణే, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో వంటి ప్రధాన నగరాల్లోని కస్టమర్లు ఇకపై బ్లింకిట్ యాప్ ద్వారా ఈ సరికొత్త ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్లతో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకున్నామని, బెస్ట్ క్వాలిటీ కలిగిన ఉత్పత్తులను మాత్రమే అందిస్తామని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

* ప్రస్తుతానికి ఇవే

ప్రస్తుతం HP ల్యాప్‌టాప్‌లు, లెనోవో, జెబ్రానిక్స్, MSI మానిటర్లు, అలాగే కానన్, HP ప్రింటర్లు బ్లింకిట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇంకా అనేక బ్రాండ్లు, విభిన్న ఉత్పత్తులను త్వరలోనే జోడించనున్నట్లు ధిండ్సా వెల్లడించారు.

పెద్ద ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెలివరీ సిబ్బంది ద్వారా ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల డెలివరీ చాలా వరకు మేనేజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి సిటీల్లోనే పరిమితమైన ఈ సర్వీసులో త్వరలో సాధారణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తే షాపింగ్ అనుభూతి మారిపోతుంది.

* ఫాస్ట్ డెలివరీ రంగంలో తీవ్రమైన పోటీ

భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్-కామర్స్ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రతి సంస్థ కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. బ్లింకిట్ మాతృ సంస్థ అయిన జొమాటో ఇటీవల 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే మార్కెట్‌లోకి ప్రవేశించింది. స్విగ్గీ, జెప్టో వంటి ప్రత్యర్థి సంస్థలు కూడా తమ సేవలను విస్తరిస్తున్నాయి.

స్విగ్గీ 'బోల్ట్' అనే 10 నిమిషాల ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రారంభించగా, జెప్టో 'జెప్టో కేఫ్' పేరుతో స్నాక్స్ డెలివరీని మొదలుపెట్టింది. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి బ్లింకిట్ కూడా 'బిస్ట్రో' పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది.

- ప్రాణాలను కాపాడే అంబులెన్స్ సేవలు

ఎలక్ట్రానిక్స్ డెలివరీతో పాటు, బ్లింకిట్ మరో కీలకమైన రంగంలోకి అడుగుపెట్టింది. కొద్ది రోజుల క్రితం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే అంబులెన్స్ సేవలను కూడా ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో గురుగ్రామ్‌లో 10 నిమిషాల్లో అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

గురుగ్రామ్‌లోని వినియోగదారులు బ్లింకిట్ యాప్ ద్వారా అంబులెన్స్ బుక్ చేసుకుంటే, కేవలం 10 నిమిషాల్లో అది వారి వద్దకు చేరుకుంటుంది.

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా నడుస్తున్న ఈ సేవలు త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. సాధారణ డెలివరీలతో పాటు అత్యవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను కూడా అందించాలనే బ్లింకిట్ నిబద్ధతకు ఇది నిదర్శనం.

More from GizBot

Best Mobiles in India

English summary
Blinkit, famed for rapid grocery delivery, expands its services to include 10-minute delivery of electronics like laptops and printers in major Indian cities, announced by CEO Albinder Dhindsa.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X