బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు

|

అభివృద్దే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఇటు టెక్నాలజీ వినియోగంలోనూ దూసుకువెళుతోంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌ల పై హ్యాకర్ల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇ-గవర్నెన్స్‌కు పటిష్టమైన సాంకేతిక భద్రతను కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Blockchain For E-Governance? Andhra Pradesh Leads The Way!

ఇందుకోసం అవసరమైన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని తాము వినియోగించుకోబోతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన సంకల్పించారు.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటంతో పాటు ఆ సాంకేతికతను విస్తరించటం అనే అంశం పై అక్టోబర్ 9, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేసారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులతో పాటు వ్యాపారవేత్తలు, సీఈఓలు పాల్గొన్నారు.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అంటే ఏంటి..?

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అనేది నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన ఓ విప్లవాత్మక ఆవిష్కరణ. ఇంటర్నెట్ కమ్యూనికేషన్ విభాగంలో సెక్యూరిటీకి పెద్దపీటవేస్తూ డిజిటల్ కరెన్సీ కోసం రూపొందించబడిన ఈ సాంకేతికతను ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ వినియోగించుకోవటం జరుగుతోంది. డిజిటల్ లెడ్జర్ రూపంలో భద్రపరచబడిన సమాచార వ్యవస్థలను ఒకదానితో మరొకదానిని అనుసంధానించి, ఇంకొకరు హ్యాక్ చేయకుండా ఎన్‌క్రిప్ట్ చేయటమే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ టెక్నాలజీలో డేటాను పొందుపరిచే వారికి ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను కేటాయించటం జరుగుతుంది. దీంతో వీరు మాత్రమే ఈ నెట్‌వర్క్‌లోకి ఎంటర్ కాగలగుతారు. హ్యాకర్లు ఈ నెట్‌వర్క్‌లోకి చొరబడాలని ప్రయత్నించిట్లయితే, ఈ టెక్నాలజీ రక్షణలో ఉన్న అన్ని విభాగాలకు హెచ్చరికలు వెళ్లిపోతాయి. దీంతో సెకన్ల వ్యవధిలో అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ టెర్మినాలజీ ప్రకారం డేటాను భద్రపరిచే సర్వర్లను 'నోడ్స్’ అని, పాస్‌వర్డ్‌ను 'హాష్ కీ’ అని పిలుస్తారు.

ఆధార్ లింక్ ఇచ్చారా.. దూసుకొస్తున్నగడువు తేదీలతో జాగ్రత్త మరిఆధార్ లింక్ ఇచ్చారా.. దూసుకొస్తున్నగడువు తేదీలతో జాగ్రత్త మరి

బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీ కోసం అభివృద్ధి చేయబడిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీని జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు దుబాయ్, స్విడెన్, హోండురస్ వంటి దేశాలు ఇప్పటికే వినియోగించుకుంటున్నాయి.

భారత్‌లో ఈ టెక్నాలజీని వినియోగించుకుంటోన్న మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సాంకేతికతను రెవెన్యూ శాఖలోని భూరికార్డులను భద్రపరిచేందుకు ఉపయోగిస్తున్నారు. ఇటు రవాణా శాఖలోనూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించుకోవటం జరుగుతోంది.

త్వరలోనే మరిన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డేటాకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ పరిధిలోకి తీసుకురానున్నారు. బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ప్రభుత్వ రంగ సెక్టార్‌లోనే కాదు ప్రైవేటు రంగ సెక్టార్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. డేటా భద్రత కోసం దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ సాంకేతికతను వినియోగించుకుంటున్నాయి. మన రాష్ట్రంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉంటుంది.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌గా Dubai Land Department (DLD) గుర్తింపు తెచ్చుకుంది. తమ దేశంలోని మొత్తం భూరికార్డులకు సంబంధించిన డేటాకు బ్లాక్ చెయిన్ సెక్యూరిటీ సిస్టంను క్రియేట్ చేసుకున్నట్లు దుబాయ్ ప్రభుత్వం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 'ఆస్తి సంబంధిత ప్రభుత్వ లావాదేవీల ధ్రువీకరణల' నిమిత్తం తాము కూడా బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించుకుంటున్నట్లు రిపబ్లిక్ ఆఫ్ జార్జియా డిక్లేర్ చేసింది.

సురక్షితమైన ఈ-గవర్నెన్స్‌ను సాగించే క్రమంలో స్వీడన్, హోండురస్ వంటి దేశాలు కూడా బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించుకుంటున్నట్లు తెలిపాయి. యూరోపియన్ యూనియన్ కమర్షియల్ రిసెర్చ్ గ్రూప్ అయిన 'యూరోపియన్ ఇన్నోవేషన్ కౌన్సిల్’ (ఇఐసీ), బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఓ ప్రోగ్రామ్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్‌కు మూలనిధి క్రింద 2.7 బిలియన్ యూరోలను ఇఐసీ గ్రాంట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ క్రింద దాదాపు 1000కు పైగా బ్లాక్‌ చెయిన్ ప్రాజెక్టులు పట్టాలెక్కినట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Blockchain For E-Governance? Andhra Pradesh Leads The Way!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X