టెక్ దిగ్గజాల కోట్ల ఆదాయం వెనుక అన్నీ రక్తపు మరకలే

మీ స్మార్ట్‌ఫోన్ల వెనుక రక్తపు చరిత్ర దాగుందని మీకు తెలుసా.., చిన్న పిల్లల రక్తంతో బ్యాటరీలు తయారీ గురించి తెలుసా.. ఇంకా ఎన్నో షాకింగ్ విషయాలు..

|

టెక్ దిగ్గజాలు కోట్ల ఆదాయాల వెనుక దాగిన రహస్యాలు బహుశా ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఆ కంపెనీల నుంచి వచ్చే స్మార్ట్‌ఫోన్లను మాత్రమే బయటిప్రపంచం చూస్తోంది. కాని ఆ ఫోన్ తయారీకి వాడిన ముడిసరుకు ఎక్కడినుంచి వస్తోందో చాలామందికి తెలియదు. ఆ సరుకు చిన్న పిల్లల రక్తంతో తయారైందని, వారి చిందేంచే రక్తపు చెమట నుంచే ఆ వస్తువులు బయటి ప్రపంచానికి వస్తున్నాయని చాలామందికి తెలియదు. ఎవ్వరికీ తెలియని ఈ నిజాలను తెలుసుకుంటే అయ్యో పాపం అనక మానరు.

నివ్వెరపరిచే నిజాలు: చిన్న పిల్లల రక్తంతో బ్యాటరీలునివ్వెరపరిచే నిజాలు: చిన్న పిల్లల రక్తంతో బ్యాటరీలు

యుధ్ధాలతో రక్తం చిందిన ప్రదేశాల నుంచి..

యుధ్ధాలతో రక్తం చిందిన ప్రదేశాల నుంచి..

మనం నిత్యం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే...యుధ్ధాలతో రక్తం చిందిన ప్రదేశాల నుంచి, మానవ హక్కులు గుర్తించని దేశాలలో నిర్భంద కూలిలు చిందేంచే రక్తం నుంచి ఈ ఎలక్ట్రానిక్‌ వస్తువుల ముడిసరుకు వస్తోంది.

ఆఫ్రికా దేశపు కార్మికులు చిందించిన రక్తపు బిందువుల నుంచి..

ఆఫ్రికా దేశపు కార్మికులు చిందించిన రక్తపు బిందువుల నుంచి..

కెపాసిటర్లు, హైపవర్‌ రెసిస్టర్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న టాంటలమ్, ఫిలనమెంట్ల తయారీకి ఉపయోగించే టంగ్‌స్టెన్ ఆఫ్రికా దేశపు కార్మికులు చిందించిన రక్తపు బిందువుల నుంచి వస్తున్నాయి.

సోల్డర్లు తయారీకి ఉపయోగించే టిన్..

సోల్డర్లు తయారీకి ఉపయోగించే టిన్..

ఎలక్ట్రానికి సర్క్యూట్లలో ఉపయోగించే సోల్డర్లు తయారీకి ఉపయోగించే టిన్, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ బోర్డుల్లో ఉపయోగించే గోల్డ్‌ లాంటి ఖనిజాలు రక్త చరిత్ర కలిగిన కాంగో, అంగోలా, రువాండాలతోపాటు వాటి చుట్టుపక్కలున్న ఏడు దేశాల నుంచి వస్తున్నాయి.

రీచార్జిబుల్‌ బ్యాటరీల తయారీకి వాడే కోబాల్ట్‌..

రీచార్జిబుల్‌ బ్యాటరీల తయారీకి వాడే కోబాల్ట్‌..

ఇక అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగిస్తున్న రీచార్జిబుల్‌ బ్యాటరీల తయారీకి వాడే కోబాల్ట్‌ ఖనిజం కూడా కాంగో నుంచే వస్తోంది. ఈ గనులను యంత్రాలతో కాకుండా కూలీలు చిన్న పనిముట్లతో చేతులతోనే తవ్వి వెనక్కి తీస్తారు.

 ఇండియా, చైనా దేశాల్లో బాల కార్మికులు పనిచేసే చోటు నుంచి..

ఇండియా, చైనా దేశాల్లో బాల కార్మికులు పనిచేసే చోటు నుంచి..

వీటితో పాటు ఇండియా, చైనా దేశాల్లో బాల కార్మికులు పనిచేసే చోటు నుంచి కూడా ఈ స్మార్ట్ ఫోన్ల ముడిసరుకు వస్తోంది. ఇక చైనాలో అయితే కార్మికులు ఏకబిగినా 36 గంటల షిప్టుల్లో పనిచేస్తున్నారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ రిసోర్సెస్ వాచ్ ఉమ్మడిగా చేపట్టిన సర్వే..

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ రిసోర్సెస్ వాచ్ ఉమ్మడిగా చేపట్టిన సర్వే..

ఈ రక్తపు మరకలపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ రిసోర్సెస్ వాచ్ ఉమ్మడిగా చేపట్టిన సర్వే ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.

కాంగో డెమొక్రెటిక్ రిపబ్లిక్ గనులనుంచి కోబాల్డ్ ను..

కాంగో డెమొక్రెటిక్ రిపబ్లిక్ గనులనుంచి కోబాల్డ్ ను..

ఆపిల్, శాంసంగ్, సోనీ, మైక్రోసాఫ్ట్ తయారీదారులు కాంగో డెమొక్రెటిక్ రిపబ్లిక్ గనులనుంచి కోబాల్డ్ ను సేకరిస్తున్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి.

కోబాల్డ్, లిథియం అయాన్ బ్యాటరీల్లో

కోబాల్డ్, లిథియం అయాన్ బ్యాటరీల్లో

ప్రపంచంలో అత్యధిక భాగం జనం ఆదరిస్తున్నకోబాల్డ్, లిథియం అయాన్ బ్యాటరీల్లో ప్రముఖంగా వాడే పదార్థం సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో చిన్న తరహా మైనింగ్ కేంద్రాలనుంచి వస్తుందని, ఈ కేంద్రాల్లో పని చేసే కార్మికులు సుమారు ఏడు సంవత్సరాల వయసులోపు వారే ఉంటారని సర్వే చెప్తోంది.

వేతనాలు కూడా ఘోరం..

వేతనాలు కూడా ఘోరం..

ఈ కష్టానికి వారికి లభిస్తున్న వేతనాలు కూడా ఘోరంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. భూగర్భ సొరంగాల్లో ఈ మైనర్లు బేసిక్ టూల్స్ ను ఉపయోగించి సుమారు 12 గంటల పాటు పనిచేస్తే వారికి ఒకటినుంచి రెండు డాలర్లు చెల్లిస్తారని రిపోర్టులు చెప్తున్నాయి.

తిండి తిప్పలు నిద్ర అన్నీ మరచిపోయి

తిండి తిప్పలు నిద్ర అన్నీ మరచిపోయి

దీని కోసం వారు తిండి తిప్పలు నిద్ర అన్నీ మరచిపోయి ఆ గనుల్లో పనిచేస్తున్నారని ఎంతో ప్రమాదకరంగా జీవితాన్ని గడుపుతున్నారని నివేదిక నిజాలను నిగ్గు తేల్చింది.

పిల్లల కోసం పోరాడుతున్న సంస్థలన్నీ..

పిల్లల కోసం పోరాడుతున్న సంస్థలన్నీ..

భారీ లోడ్ లు మోసుకెళ్ళే ఈ గనుల్లో సుమారు 40,000 మంది పిల్లలు రోజుకు పన్నెండు గంటలపాటు పనిచేస్తున్నట్లుగా 2014 లోనే యునిసెఫ్ అంచనా వేసింది. పిల్లల కోసం పోరాడుతున్న సంస్థలన్నీ ఇప్పుడు ఏమైపోయాయో తెలియని పరిస్థితి.

 సింహభాగం చైనాకే ఎక్కువ ఎగుమతులు

సింహభాగం చైనాకే ఎక్కువ ఎగుమతులు

సొరంగాల్లో మిగిలిపోయిన రాళ్ళు, కోబాల్ట్ ను చిన్నారులు వెలికి తీస్తే... దాన్ని మధ్యవర్తులు అమ్మకాలు జరిపి చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. సింహభాగం చైనాకే ఎక్కువ ఎగుమతులు జరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలైన టెక్ కంపెనీలకు సప్లై చేస్తున్నట్లు...

ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలైన టెక్ కంపెనీలకు సప్లై చేస్తున్నట్లు...

ఈ పదార్థాలను ఎగుమతి దారులునుంచి చైనా, దక్షిణ కొరియాల్లోని బ్యాటరీ తయారీదారులు కొనుగోలు చేసి, వాటి ఉత్పత్తులను ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలైన టెక్ కంపెనీలకు సప్లై చేస్తున్నట్లు ఆమ్నెస్టీ వివరిస్తోంది. దిగ్గజ కంపెనీలకు దాని వెనుక కష్టం కన్నా అది బాగా ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నాయని చెబుతున్నారు.

శాంసంగ్, సోనీ సహా పలు కంపెనీలు

శాంసంగ్, సోనీ సహా పలు కంపెనీలు

అయితే శాంసంగ్, సోనీ సహా పలు కంపెనీలు ఈ విషయాన్ని నిర్థారించేందుకు, అంగీకరించేందుకు నిరాకరిస్తున్నాయి.ఈ విషయంపై మేము ఇప్పుడు ఏమీ మాట్లాడలేమని విషయాన్ని నిర్థారించుకున్న తరువాతే మేమే దీనిపే స్పందిస్తామని చెబుతున్నాయి.

Best Mobiles in India

English summary
Blood minerals are electronics industry’s dirty secret Read more at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X