Blood Moon 2021: మే 26న ఆకాశంలో ఎర్రటి రంగులో 'బ్లడ్ మూన్'!! మిస్ అవ్వకండి

|

2021 మే నెల 26 న ఆకాశంలో అద్భుతమైన దృశ్యం 'బ్లడ్ మూన్' కనిపించనుంది. సాధారణం భాషలో చెప్పాలంటే దీనిని సంపూర్ణ చంద్ర గ్రహణం లేదా పూర్ణ చంద్ర గ్రాహన్ అని పిలుస్తారు. చంద్రుడు భూమి యొక్క నీడలోకి రావడంతో ఆకాశంలో ఎర్రటి రంగు కాంతితో ప్రతిబింబించి రక్తం కలర్ వలె చంద్రుడు కనిపించనున్నాడు. 2021 లో మొదటి మరియు చివరిసారిగా రాబోతున్న ఈ బ్లడ్ మూన్ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో స్కై వీక్షకులకు కనిపిస్తుంది. అయితే భారతదేశంలోని ప్రజలకు ఇది కేవలం ఐదు నిమిషాల పాటు పెనుంబ్రాల్ చంద్ర గ్రహణంగా కనిపిస్తుంది. మే 26 న రాబోయే చంద్ర గ్రహణం యొక్క పూర్తి సమాచారం అంటే భారతదేశంలో చంద్ర గ్రహణం యొక్క తేదీ మరియు సమయం వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బ్లడ్ మూన్ 2021 సమయం

బ్లడ్ మూన్ 2021 సమయం

నాసా యొక్క సమాచారం ప్రకారం 2021 సంవత్సరంలో బ్లడ్ మూన్ లేదా చంద్ర గ్రహణం పాక్షిక మరియు సంపూర్ణ గ్రహణం మూడు గంటల ఏడు నిమిషాల పాటు ఉంటుంది. ఇండియాలో సంపూర్ణ చంద్ర గ్రహణం సుమారు 15 నిమిషాలు కనిపిస్తుంది. ఈ గ్రహణం ఉదయం 08:47 గంటలకు UTC (మధ్యాహ్నం 2:17 IST) నుండి ప్రారంభమవుతుంది. ఏదేమైనా సంపూర్ణ గ్రహణం ఉదయం 11:11 గంటలకు UTC (4:41 pm IST) వద్ద మొదలై గరిష్టంగా రాత్రి 11:18 గంటలకు UTC (4:48 pm IST) వద్ద ఉంటుంది. ఉదయం 11:25 UTC (4: 55pm IST) వద్ద సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. సంపూర్ణ చంద్ర గ్రహణం మధ్యాహ్నం 01:49 గంటలకు UTC (7:19 am IST) వద్ద ముగుస్తుంది.

బ్లడ్ మూన్ 2021 భారతదేశంలో కనిపిస్తుందా?
 

బ్లడ్ మూన్ 2021 భారతదేశంలో కనిపిస్తుందా?

సంపూర్ణ చంద్ర గ్రహణం లేదా బ్లడ్ మూన్ 2021 లో దక్షిణ / తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం మరియు అంటార్కిటికా, నార్వేజియన్ ప్రాంతాలలో పైన తెలిపిన సమయం మరియు తేదీ నివేదికలలో కనిపిస్తుంది. మొత్తం గ్రహణం కనిపించే కొన్ని నగరాల్లో హోనోలులు, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్, మనీలా, మెల్బోర్న్, శాన్ ఫ్రాన్సిస్కో, సియోల్, షాంఘై మరియు టోక్యో ఉన్నాయి. వీటితో పాటుగా బ్యాంకాక్, చికాగో, మాంట్రియల్, న్యూయార్క్, టొరంటో మరియు యాంగోన్ వంటి నగరాల్లో కూడా పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. ఏదేమైనా భారతదేశంలో పెనుంబ్రాల్ చంద్ర గ్రహణంగా మాత్రమే కనిపిస్తుంది. తదుపరి బ్లడ్ మూన్ లేదా సంపూర్ణ చంద్ర గ్రహణం 2022 మే 16 న రానున్నది. దీనితో పాటుగా నవంబర్ 19 న పాక్షిక చంద్ర గ్రహణం కూడా ఉంటుంది.

బ్లడ్ మూన్ అంటే ఏమిటి?

బ్లడ్ మూన్ అంటే ఏమిటి?

బ్లడ్ మూన్ సమయంలో సూర్యుడు మరియు చంద్రుడి మధ్య భూమి ఉంటుంది. ఈ సందర్భంలో సూర్యకాంతిని చంద్రుని వద్దకు రాకుండా భూమి పూర్తిగా అడ్డుకుంటుంది. దీని కారణంగా చంద్రుని ఉపరితలం నుండి ప్రతిబింబించే కాంతి మాత్రమే భూమి యొక్క వాతావరణం ద్వారా వక్రీభవించడంతో చంద్రుని ఉపరితలం ఎర్రగా మారినట్లు 'బ్లడ్ మూన్' వలె చంద్రుడు కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన గేర్ అవసరం లేకుండానే నేరుగా కళ్ళతో చూడవచ్చు. మీరు టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహణాన్ని చూడగలిగితే కనుక ప్రత్యేక అనుభవాన్ని పొందుతారు.

పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం అంటే ఏమిటి

పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం అంటే ఏమిటి

భూమి యొక్క కేంద్ర భాగం మరియు నీడ (అంబ్రా) చంద్రుని ఉపరితలం మొత్తాన్ని కప్పి ఉంచే మొత్తం చంద్ర గ్రహణం వలె కాకుండా, భూమి సూర్యుని కాంతిని చంద్రుని ఉపరితలం చేరుకోకుండా నిరోధించినప్పుడు నీడ యొక్క బయటి భాగంతో మాత్రమే కప్పబడి ఉంటుంది. దీనిని పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం అంటారు. మొత్తం చంద్ర గ్రహణాలతో పోలిస్తే పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం విషయంలో ఎర్రటి రంగు ప్రభావం తక్కువగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Blood Moon and Total Lunar Eclipse 2021: Moon in Red Color in The Sky

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X