రెండేళ్ల తర్వాత బ్లూ ఆరిజన్ అంతరిక్ష యాత్ర.. భారత తొలి అంతరిక్ష పర్యాటకుడు (Space Tourist) తెలుగువాడే..!!
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ.. రెండేళ్ల విరామం తర్వాత స్పేస్ టూరిజాన్ని ప్రారంభించింది. బ్లూ ఆరిజన్‌కు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ న్యూషెపర్డ్ రాకెట్ (Blue Origin NS-25 space Mission)ఆదివారం అమెరికాలోని పశ్చిమ టెక్సాస్‌లోని ప్రయోగ వేదిక నుంచి అంతరిక్షంలోనికి వెళ్లింది.
ఈ అంతరిక్ష యాత్రలో భాగంగా ఆరుగురు పాల్గొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ (Thotakura Gopi) ఉన్నారు. రాకేష్‌శర్మ తర్వాత అంతరిక్ష యాత్ర చేసిన రెండో భారతీయుడుగా గోపీచంద్ గుర్తింపు పొందారు. స్పేస్ టూరిజంలో భాగంగా అంతరిక్ష యాత్ర చేసిన భారత తొలి స్పేస్ టూరిస్ట్‌గా First Indian Space Tourist) గోపీచంద్ రికార్డు సృష్టించారు.

బ్లూ ఆరిజన్ న్యూషెపర్డ్ రాకెట్ భూమి నుంచి 100 కిలోమీటర్లకు పైన ఉన్న కార్మాన్ రేఖను దాటి ప్రయాణించింది. భూ వాతావరణం మరియు అంతరిక్షానికి సరిహద్దుగా ఈ కార్మాన్ రేఖను భావిస్తారు. బూస్టర్ క్యాప్సూల్ నుంచి వేరుపడింది. అనంతరం కొద్దిసేపు అంతరిక్షంలో గడిపారు. వ్యోమగాములున్న క్యాప్సూల్ పారాచుట్ల సాయంతో భూమికి తిరిగి వచ్చింది. కొద్దిసేపటికే బూస్టర్ కూడా భూమికి చేరింది.
ఈ అంతరిక్ష యాత్రతో తెలుగు వ్యక్తి గోపీచంద్‌తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, అమెరికా ఎయిర్‌ఫోర్స్ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్, ఫ్రాన్స్, అమెరికా వ్యాపారవేత్తలు సిల్వైన్ చిరోన్, కెన్నెత్ ఎల్ హెస్, కరోల్ షాలర్ కూడా ఉన్నారు. అయితే ఎడ్ డ్వైట్ ప్రస్తుత వయస్సు 90 సంవత్సరాలు కాగా.. అంతరిక్ష యాత్ర చేసి తొలి పెద్ద వయస్కుడిగా ఎడ్ డ్వైట్ గుర్తింపు పొందారు.
తోటకూర గోపీచంద్ ఎక్కడ జన్మించారు : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తోటకూర గోపీచంద్ జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోనే నివాసం ఉంటున్నారు. అయితే భారత పాస్‌పోర్టు ను కలిగి ఉన్నారు. గోపీచంద్ ప్రస్తుతం అట్లాంటాలోని ప్రిజర్స్ లైఫ్ సంస్థకు సహ- వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
తోటకూర గోపీచంద్ పైలెట్ శిక్షణ కూడా పొందారు. దీంతోపాటు గ్లైడర్లు, సీప్లేన్‌ను, హాట్ ఎయిర్ బెలూళ్లను నడిపిన అనుభవం గోపీచంద్ సొంతం. అంతరిక్ష యాత్ర అనంతరం గోపీచంద్ సహా ఇతర స్పేస్ టూరిస్టులు తన అనుభవాన్ని వెల్లడించారు. మరియు సంతోషం వ్యక్తం చేశారు.
"అద్భుతంగా ఉంది... దీన్ని మీ కళ్లతో చూడాలి. ప్రతి ఒక్కరూ అంతరిక్షంలోకి వెళ్లాలి. అంతరిక్షంలోకి చూడడం ఎలా ఉందో వర్ణించలేను. అంతరిక్షం నుంచి భూమిని చూడడం చాలా బాగుంది" అంటూ భారత తొలి స్పేస్ టూరిస్ట్‌గా గుర్తింపు పొందిన తోటకూర గోపీచంద్ తెలిపారు.
తోటకూర గోపీచంద్ ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తిచేశారు. వాణిజ్యపరమైన జెట్ విమానాలను కూడా నడిపారు. మరియు మెడికల్ జెట్ పైలెట్‌గా కూడా గోపీచంద్ గుర్తింపు పొందారు. ఇటీవల టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో పర్వత శిఖరానికి గోపీచంద్ వెళ్లారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








