బ్లూవేల్ గేమ్.. కిల్లర్ గేమ్ కాదట!

Posted By: Madhavi Lagishetty

ఇప్పటివరకు రకరకాల గేమ్స్ చూసివుంటారు. గేమ్స్ పేర్లు కూడా వినే ఉంటారు. కానీ బ్లూ వేల్ ఛాలెంట్ గేమ్ గురించి మీకు తెలుసా? దీన్ని డేత్ గేమ్ అని కూడా అంటారు. ఇది ఆన్ లైన్ గేమ్ లా తెరపైకి వచ్చింది. ఈ ఆటకు అలవాటు పడినట్లయితే...ప్రాణాలు పోవడం ఖాయం. గేమ్ లాస్ట్ వరకు ఆడాలంటే ప్రాణాలు తీసుకోవల్సిందే. కాదు ప్రాణాలు తీసుకోవడమే ఈ గేమ్ లాష్ట్ కండిషన్.

బ్లూవేల్ గేమ్.. కిల్లర్ గేమ్ కాదట!

క్విట్ కావడం అంత ఈజీ కాదు. ఈ ఆట ఆడిన చాలా మంది పిల్లలు, యువకులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ గేమ్ ఆడితే ప్రాణాలు పోతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ...ప్రత్యక్ష సాక్ష్యాలు మాత్రం దొరకలేవు.

బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ గురించి CERT- ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. దేశంలో ఆన్ లైన్లో బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ఆడిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనల గురించి ఆరా తీస్తుంది. ఇదే విషయంపై లోక్ సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారామ్ లిఖితపూర్వకంగా సమాధానం కూడా ఇచ్చారు. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకున్న కేసులను దర్యాప్తు చేయడానికి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం-ఇండియా, డైరెక్టర్ జనరల్ ఛైర్మన్ పదవిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

రాష్ట్రాలు మరియు UTలు పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షించటానికి, గేమ్ యొక్క ప్రతిపాదకులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. CERT-IN కమిటీ ఇంటర్నెట్ కార్యకలాపాలు, డివైస్ యాక్టివిటీస్, కాల్ రికార్డులు, ఇతర సోషల్ మీడియా యాక్టివిటీస్ , ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను విశ్లేషించి...ఈ ఘటనలతో సంబంధం కలిగి ఉన్న బాధితులను రక్షించారు.

జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా ఐడియా సరికొత్త ప్లాన్ !

అయితే ఈ సంఘటనలు కేవలం బ్లూ వేల్ గేమ్ ఆడినందుకు జరిగినవి కావని అహిర్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన ఒక అఫిడవిట్ పేర్కొంది. CERT డైరెక్ట్ జనరల్ నేత్రుత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ గేమ్ తో సంబంధం ఉన్న ఆత్మహత్య లేదా ఆత్మహత్యకు ప్రయత్నించిన కేసులను ఈ కమిటీ పరిశోధిస్తుంది. కమిటీ తన తాత్కాలిక ఆవిష్కరణలతో CERT-IN నివేదించిన రిపోర్టులో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్నవారికి బ్లూ వేల్ గేమ్ కు ఎలాంటి ప్రమేయం లేదని సూచించింది.

అసలు ఈ బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ రష్యాలో ప్రారంభమైంది. ఇప్పుడు ఇండియాకు పాకింది. రష్యాలోని ఒక పాత నేరస్తుడు ఈ గేమ్ ను క్రియేట్ చేశారు. అతని మానసిక స్థితి బాగుండదు. మానసికంగా తమని తాము చంపిన వారే విజేత దశను తీసుకునే ముందు 50రోజులపాటు సాహోసోపేతంగా ఈ గేమ్ ను ఆడాల్సి ఉంటుంది. నిర్వాహకులు ఇచ్చిన టాస్కులన్నీ పూర్తిచేయాల్సి ఉంటుంది.

అడిష్నల్ సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహా మాట్లాడుతూ... సుప్రీం కోర్డు బెంచ్ కు అక్టోబర్ చివరలో ఇటువంటి ఆటలకు సంబంధించిన 28 కేసులను నివేదించినట్లు తెలిపారు.

అయితే బ్లూ వేల్ గేమ్ యొక్క స్రుష్టికర్త అరెస్టు అయినప్పటికీ...ఈ గేమ్ ఆన్ లైన్లో వైరల్ గా మారింది. చాలామంది యువకులు ఆత్మహత్యకు పాల్పడుతునే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన 19ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పూర్తిగా బ్లూవేల్ ఛాలేంజ్ గేమ్ తో ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది.

English summary
A CERT-In investigation has now stated that no connection has been established relating to incidents of children committing suicide after playing online "Blue Whale Challenge Game" in states and union territories.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot