ఉసురు తీస్తోన్న Blue Whale ఛాలెంజ్, ఇండియాలో మరొకరు ఆత్మహత్య

ప్రపంచదేశాలను కలవరపెడుతున్న ప్రాణాంతక ఆన్‌లైన్ గేమ్ బ్లూవేల్ (Blue Whale), భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపెడుతోంది. ఈ సూసైడ్ గేమ్ మత్తులో మునిగి మరో ఇండియాన్ టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Read More : మీరు వాడుతున్న మొబైల్ సిమ్ మీ పేరుమీద లేదా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

14 సంవత్సరాల అన్కన్ దే బ్లూవేల్ ఛాలేంజ్‌కు బలయ్యాడు..

పశ్చిమ్‌బెంగాల్ పరిధిలోని మిద్నాపూర్‌కు చెందిన 14 సంవత్సరాల అన్కన్ దే బ్లూవేల్ ఛాలేంజ్‌కు బలైనట్లు భావిస్తున్నారు. ఇతని ఆత్మహత్యకు బ్లూవేల్ గేమ్‌లోని ఛాలెంజ్ కారణమా లేదా మరేవైనా ఇతర కారణాలు ఉండిఉండొచ్చా అనే దానిపై పోలీసులు దర్యాప్త్తు చేస్తున్నారు.

విగతజీవిలా పడిఉన్నాడు

సీఎన్ఎన్ న్యూస్18 పోస్ట్ చేసిన కథనం ప్రకారం అన్కన్ గతకొంత కాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయినట్లు తెలుస్తోంది. అన్కన్ బాత్‌ రూమ్‌లోకి వెళ్లి ఎంతసేపటికి డోర్ తీయకపోవటంతో అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే డోరును పగలగొట్టి చూసేసరికి అతడు విగతజీవిలా పడిఉన్నాడు.

ప్లాస్టిక్ కవర్‌ను ముఖానికి చుట్టుకుని..

ప్లాస్టిక్ కవర్‌ను ముఖానికి చుట్టుకుని ఊపిరాడకుండా ఉండేందుకు తుండుతో తన మెడను టైట్‌గా బిగించుకుని అన్కన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసుకులు అన్కన్ దే మొబైల్ ఫోన్‌తో పాటు అతని తండ్రి కంప్యూటర్‌ను కూడా సీజ్ చేసి ఆత్మహత్యకు ప్రేరేపించటానికి గల కారణాలను దర్యాప్తుచేస్తున్నారు.

ముంబైకు చెందిన 14 సంవత్సరాల మన్‌ప్రీత్

మొన్నటికి మొన్న ముంబైకు చెందిన 14 సంవత్సరాల బాలుడు మన్‌ప్రీత్ ఈ గేమ్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గేమ్ రూల్స్‌లో భాగంగా చివరి టాస్క్‌ను నిర్వర్తించేందుకుగాను భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీని కూడా మన్‌ప్రీత్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసాడు. షాలాపూర్, ఇండోర్ ప్రాంతాల్లోనూ బ్లూవేల్ ఛాలేంజ్‌ సంఘటనలు వెలుగు చూసాయి.

ఇంటి నుంచి పారిపోయి..

షాలాపూర్‌కు చెందిన ఓ 9వ తరగతి విద్యార్థి బ్లూవేల్ గేమ్‌లోని టాస్క్‌లను పూర్తి చేసేందుకు‌గాను ఇంటి నుంచి పారిపోయాడు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గాలింపుచర్యలు చేపట్టి అతడిని పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఆ విద్యార్థికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ఇండోర్‌లో మరో సంఘటన

ఇండోర్ ప్రాంతానికి చెందిన మరో 13 సంవత్సరాల విద్యార్థి బ్లూవేల్ ఛాలేంజ్‌కు సిద్ధమై స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని నిలువరించే ప్రయత్నం చేసారు.

ప్రపంచమంతా పాకిపోయింది..

ఈ వికృత గేమ్ తొలత, ఫేస్‌బుక్ తరహాలో ఉండే ఓ రష్యన్ సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. ఈ గేమ్‌ను రూపొందించిన వ్యక్తి ఓ సైకో అని తెలుస్తోంది. ఇతగాడిని రష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికి గేమ్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయిపోవటంతో ప్రపంచమంతా పాకిపోయింది.

ఒక్క రష్యాలోనే 130 మంది టీనేజర్ల ఆత్మహత్య

ఈ గేమ్ ఆడటం కారణంగా ఒక్క రష్యాలోనే 130 మంది టీనేజర్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ ప్రమాదకర సోషల్ మీడియా గ్రూప్ ఈ బ్లూవేల్ సూసైడ్ గేమ్‌ను నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ గ్రూపులోని వ్యక్తులే టీనేజర్లను ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తున్నారు.

50 రోజులు 50 టాస్కులు..

బ్లూవేల్ గేమ్ ఆడాలనుకునే వారు ముందుగా దానికి సంబంధించి అకౌంట్‌ను ఓపెన్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత బ్లూవేల్ గేమ్ ఛాలెంజ్‌లో భాగంగా మొత్తం 50 టాస్క్‌లను అసైన్ చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో ఛాలెంజ్‌ను పూర్తి చేయవల్సి ఉంటుంది. ఛాలేంజ్‌ను నిర్విహించే ప్రతిసారి ఆ ఫోటోలను గేమ్ నిర్వాహకులకు పంపాల్సి ఉంటుంది.

చివరి వరకు ఆడితే ఆత్మహత్యే..

మొదట్లో సులువైన టాస్కులనే అందుబాటులో ఉంచినప్పటికి క్రమక్రమంగా డోస్ పెంచుకుంటూ పోతుంటారు. ఛాలెంజ్ చివరి రోజున ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తారు. జీవితం పై అవగాహన ఉన్న తెలివైన విద్యార్థులు మధ్యలోనే ఈ గేమ్‌ను వదిలేస్తుంటే, మరికొందరు మాత్రం చివరి వరకు ఆడి తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఈ గేమ్ జోలికి పిల్లల్ని వెళ్లకుండా చూడాలని తల్లిదండుల్ని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్లు కూడా తమ యూజర్లను ఈ గేమ్ బారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు హెల్ప్‌లైన్లనూ ఏర్పాటు చేశాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Blue Whale challenge: Second casualty in India, 14-year-old boy commits suicide. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting