బ్లూటూత్ ఆన్ చేస్తున్నారా..అయితే మీ మొబైల్ గోవిందా !

Written By:

మీరు బ్లూటూత్ ఆన్ చేస్తున్నారా.. ఫైల్స్ ట్రాన్స్ ఫర్ కోసం దాని మీదనే ఆధారపడుతున్నారా..అయితే మీరు చాలా ప్రమాదంలో చిక్కుకున్నట్లేనని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లూటూత్ ఎనేబుల్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాకర్ల చేతిలోకి పోతుందట. అదెలాగో మీరే తెలుసుకోండి.

చైనా వస్తువుల ఆదాయంపై దిమ్మతిరిగే నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎనేబుల్

బ్లూటూత్ మోడ్యూల్స్ తక్కువ విద్యుత్ వినియోగించుకుంటున్నదనే విషయం అందరికీ తెలిసిందే. దాంతో దాన్ని ఎప్పుడూ ఎనేబుల్ చేసి ఉంచుతున్నారు చాలామంది. అయితే ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

BlueBorne అనే టూల్

ఇది నిరంతరం ఆన్ చేసి ఉండటం వల్ల మీ ఫోన్లలోని సమస్త సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళుతుందట. అందుకోసం హ్యకర్లు BlueBorne అనే మాల్‌వేర్‌ని ఫోన్లలోకి వదులుతున్నారట. ఇది పెద్ద ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే

అయితే ఈ లోపం కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఉంది. ఆపిల్ ఐవోఎస్, విండోస్ ఫోన్లకు ఈ BlueBorneతో ఎటువంటి ప్రమాదం లేదు.

డేటాను కాపీ చేసుకునే అవకాశం

తనకు దగ్గర్లో ఆన్ అయిన బ్లూటూత్ ఫోన్లను హ్యాకర్ గుర్తించిన వెంటన్ ఈ మాల్‌వేర్‌ ద్వారా ఆ ఫోన్లకు కనెక్ట్ అయి వాటిలోని డేటాను కాపీ చేసుకునే అవకాశం ఉంది. అదీ Pairing లేకుండానే.

మీ ఫోన్ లోని స్క్రీన్ మొత్తాన్ని

దీంతో పాటు హ్యాకింగ్ చేసేవారు మీ ఫోన్ లోని స్క్రీన్ మొత్తాన్ని హ్యాకర్ చూడగలుగుతాడు. అలాగే తన కంట్రోల్ లోకి తెచ్చుకోగలుగుతాడు. సో బ్లూటూత్ వాడువారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5.3 బిలియన్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు

ప్రపంచవ్యాప్తంగా 5.3 బిలియన్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ మాల్ వేర్ ప్రమాదం పొంచి ఉంది. అయితే Microsoft, Google, Linux, and Apple లాంటి కంపెనీలకు దీనిపై సమాచారం అందడంతో అవి ముందే patches ని రెడీ చేసుకున్నాయి. 

ఇంటర్నెట్ కి ఈ మాల్‌వేర్‌తో

ఈ మాల్‌వేర్‌ మీరు ఎటువంటి ఫైల్స్ ఓపెన్ చేయడం ద్వారా కాని అలాగే ఫైల్స్ డౌన్లోడ్ చేయడం ద్వారా కాని ఫోన్లకు రాదు. ఇంటర్నెట్ కి ఈ మాల్‌వేర్‌తో ఎలాంటి ప్రమాదం లేదు. కేవలం బ్లూటూత్ ద్వారానే ప్రమాదం పొంచి ఉంది.

ఈ లోపంపై గూగుల్

అయితే ఈ లోపంపై గూగుల్ ఇంకా ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. త్వరలోనే దీనికి పరిష్కార మార్గాన్ని గూగుల్ సూచించే అవకాశం ఉంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Hackers can steal data off your Android phone via Bluetooth Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting