Bluetooth కొత్త వర్షన్ స్పీడ్ ఎంతో తెలుసా..?
స్మార్ట్‌హోమ్, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, లోకేషన్ ఆధారిత యాప్స్‌తో పాటు సర్వీసులకు బ్లూటూత్ 5 మరింత ఊతమివ్వనుంది.
బ్లుటూత్ ఇప్పుడు మరింత వేగంగా పనిచేయబోతోంది. బ్లుటూత్ కొర్ స్పెసిఫికేషన్స్ పై గత కొన్ని సంవత్సరాలుగా శ్రమిస్తోన్న బ్లటూత్ స్పెషల్ ఇంట్రస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) సరికొత్త అప్‌డేట్స్‌తో కూడిన 'బ్లుటూత్ 5' వర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ వర్షన్‌ను జూన్, 2016లోనే అనౌన్స్ చేయటం జరిగింది.
Read More : నోకియా గురించి మరో హాట్ న్యూస్

బ్లుటూత్ 4.2 వర్షన్‌తో పోలిస్తే...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్లుటూత్ 4.2 వర్షన్‌తో పోలిస్తే బ్లుటూత్ 5 నాలగు రెట్ల ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. ఇదే సమయంలో స్పీడ్ విషయానికి వచ్చేసరికి 4.2 వర్షన్ తో పోలిస్తే రెండితలు వేగంగా పనిచేస్తు్ంది. బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ కెపాసిటీ విషయంలోనూ 8 రెట్ల వేగంతో బ్లుటూత్ 5 స్పందిస్తుంది. స్మార్ట్‌వాచ్‌ల విభాగంలోనూ బ్లుటూత్ 5 మరింత కీలకం కాబోతోంది.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్..
బ్లూటూత్ 5 ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్'ను ఉద్దేశించి డిజైన్ చేయటం జరుగుతోంది. ఆధునిక టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌లతో రాబోతున్న ‘బ్లూటూత్ స్మార్ట్'.. స్మార్ట్‌హోమ్, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, లోకేషన్ ఆధారిత యాప్స్‌తో పాటు సర్వీసులకు మరింత ఊతమివ్వనుంది. బ్లూటూత్ 5 అసాధారణ వేగంతో స్పందిస్తుంది. క్రిటికల్ పరిస్థితిల్లోనూ వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్‌కు దోహదపడుతుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్లూటూత్ ఫీచర్ చాలా సుపరిచితం
స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న అందరికి బ్లూటూత్ ఫీచర్ చాలా సుపరిచితం. రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ వ్యవస్థ అనేది పరిమిత స్థాయిలో పరిమిత వ్యక్తుల అనుమతితో పరిమిత పరిధిలో పని చేస్తుంది.

ఓ ఫీచర్‌గా అందించటం జరుగుతోంది..
మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ వంటి కమ్యూనికేషన్ డివైసుల్లోకి బ్లూటూత్ శరవేగంగావ్యాప్తి చెందింది. అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్‌లు మొదలుకుని దేశీవాళీ మొబైల్ తయారీ కంపెనీల వరకు తాము రూపొందిస్తోన్న ఫోన్‌లలో బ్లూటూత్ అప్లికేషన్‌ను ఓ ఫీచర్‌గా అందిస్తున్నాయి.

కమ్యూనికేషన్ ఇంకా మల్టీమీడియా విభాగాల్లో
బ్లూటూత్ వినియోగం కమ్యూనికేషన్ ఇంకా మల్టీమీడియా విభాగాల్లో మరింతగా వ్యాప్తి చెందింది. బ్లూటూత్ సాంకేతికత, ఇన్స్ట్ట్‌ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ నిర్థేశించిన వ్యవస్థ ప్రకారం కోడ్ నెంబరు IEEE 802.15.1లో పనిచేస్తుంది.

ఏకకాలంలో 7 పరికరాలకు...
గ్రూప్ విధానంలో భాగంగా బ్లూటూత్ వ్యవస్థను ఏకకాలంలో 7 పరికరాలకు మాత్రమే కనెక్ట్ చేయగలం. బ్లూటూత్ కనెక్షన్ 10 మీటర్ల పరిధి వరకు స్పందించగలదు. దూరం పెరిగే కొద్ది సిగ్నల్స్ ప్రవాహం మందగిస్తుంది.

షేరిట్ రాకతో..
షేరిట్, Xender, సూపర్‌బీమ్, జాప్యా వంటి యాప్స్ అడ్వాన్సుడ్ డేటా ట్రాన్స్ ఫర్ ఫీచర్లతో అందుబాటులోకి రావటంతో బ్లుటూత్ వినియోగం ఒకింత తగ్గిందనే చెప్పాలి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








