బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

Written By:

మొబైల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్స్, గేమింగ్ కన్ సోల్స్‌లో డేటా షేరింగ్‌కు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వైర్ లెస్ టెక్నాలజీ బ్లూటూత్‌లో ఓ పెద్ద అప్ డేషన్ యూజర్ల ముందుకు రాబోతోంది. ఈ అప్ డేటెడ్ బ్లూటూత్ వెర్షన్-5 ను జూన్ 16న లండన్ లో ఆవిష్కరించనున్నట్టు బ్లూటూత్ స్ఫెషల్ ఇంటరెస్ట్ గ్రూప్(ఎస్ఐజీ) ప్రకటించింది. ప్రస్తుతమున్నపరిధి కంటే రెండింతలు ఎక్కువ పరిధిలో పనిచేసేలా ఈ వెర్షన్ అప్ గ్రేడ్ చేశారు.

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

అలాగే డేటా ట్రాన్ ఫర్ కూడా ఈ వెర్షన్ తో నాలుగురెట్లు అధికంగా ఉండబోతోంది. ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైజ్ లన్నింటికీ కూడా ఈ వెర్షన్ సపోర్టు చేసేలా దీన్ని రూపొందించారు. స్మార్ట్‌ఫోన్లు, ఇతర డివైజ్‌లు ఈ కొత్త బ్లూటూత్ స్టాండర్డ్‌ను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో లండన్‌లో జరగబోయే ఈవెంట్‌లో వివరిస్తామని ఎస్ఐజీ తెలిపింది. బ్లూటూత్ అసలు ఎప్పుడు పుట్టింది . ఎవరు కనుక్కున్నారు...ఇలాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Readmore: కంప్యూటర్లు దండగ..లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

బ్లూ టూత్ అంటే ఎలక్ట్రానిక్ పరికరాలను ఒక దానితో ఒకటి కలిపి ఉంచే ఒక స్వల్ప రేంజి కల వైర్లెస్ రేడియో టెక్నాలజీ

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

1994 సంవత్సరంలో బ్లూ టూత్‌ పద్ధతిని సెల్‌ఫోన్ల తయారీ సంస్థ ఎరిక్‌సన్‌ మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఎరిక్సన్, తరువాత ఐబిమ్, ఇన్‌టెల్, నోకియా, టోషిబా ఇలా రకరకాల కంపెనీలు దీన్ని వాడుకలోకి తీసుకువచ్చాయి.

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే 10వ శతాబ్దపు ప్రాంతంలో స్కాండినేవియాను హెరాల్డ్‌ బ్లూ టూత్‌ అనే చక్రవర్తి పాలించేవారు. ఆయన తన రాజ్యంలో ఎపుడూ గొడవలు పడే కొన్ని తెగల్ని తన పరిపాలనా సామర్థ్యంతో ఐక్యం చేయగలిగారు.

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

ఇలా వేర్వేరు జాతుల్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి, ఐకమత్యాన్ని సాధించడానికి బ్లూ టూత్‌ చక్రవర్తికి చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. ఆయనలాగే ఇది కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని దానికి బ్లూటూత్ అని పేరు పెట్టారు.

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

ఎరిక్‌సన్‌ కంపెనీలో పనిచేసే జిమ్‌కర్డాష్‌ రెండు విడివిడి ఎలక్ట్రానిక్‌ సాధనాల్ని జతపరిచే పద్ధతికి 1997లో బ్లూ టూత్‌ పద్ధతి అని పేరు పెట్టాడు.

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

అప్పటి నుంచి అదే పేరుతో అమల్లో ఉంది. బ్లూ టూత్‌ గుర్తు కూడా హెరాల్డ్‌ బ్లూటూత్‌. ఇది చక్రవర్తి పేరుతోనే ఇది ఉంటుంది.

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

మనం దగ్గరగా పరిశీలిస్తే దీని చిహ్నములో రునిక్ అక్షరం అయిన 'హెచ్' మరియు హెరాల్డ్ బ్లూ టూత్ ఇంటి పేరు లో మొదటి అక్షరం 'బి' కలిగి ఉంటాయి.

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

మనం ప్రస్తుతం ఉపయోగించే బ్లూ టూత్, బ్లూ టూత్ కోర్ స్పెసిఫికెషన్ వర్షన్ ౩.౦+హైస్పీడ్.

బ్లూటూత్ నుంచి అతి పెద్ద అప్‌డేట్

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Bluetooth 5 With Massively Improved Range, Speed Coming on June 16
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot