ఇంటర్నెట్‌లో వైరల్‌గా BoAt యాడ్... ఆపిల్‌ను టార్గెట్ చేసిందా.. అసలు ఏముందీ వీడియోలో...?
మార్కెట్‌లో వివిధ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. అనేక పద్ధతుల ద్వారా ఈ సంస్థ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. అందులో యాడ్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ యాడ్స్ కొన్ని సార్లు ఆయా సంస్థల ఉత్పత్తులను ప్రజల్లోకి అత్యంత వేగంగా తీసుకెళ్తాయి. అదే మరి కొన్నిసార్లు విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతాయి.
నేరుగా ఆపిల్‌ను టార్గెట్ చేసిందా?
అయితే ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్ (BoAt) కొత్త యాడ్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నేరుగా బ్రాండ్ పేరు చెప్పకపోయినా.. ఆపిల్ (Apple Airpods) సంస్థ ఉత్పత్తుల కంటే తమ కొత్త ఉత్పత్తి అత్యంత సౌకర్యంగా ఉంటుందని చెప్పేందుకు ఈ యాడ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

వీడియో వైరల్ అవుతోంది...కానీ :
యాడ్‌లో ఎక్కడా ఆపిల్ సంస్థను ప్రస్తావించకుండానే ఐ, ప్రో, మ్యాక్స్ వంటి పదాలను ఉపయోగించింది. ఆపిల్ ఎయిర్‌పాడ్స్ నుంచి BoAt ఉత్పత్తులకు మారాలని కోరింది. అయితే ఈ యాడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మిక్సిడ్ రివ్యూలను ఇస్తున్నారు. కొందరు బోట్ యాడ్‌ను మెచ్చుకుంటున్నారు. అదే మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
ఫ్యాన్ బాయ్‌గా ఉండొద్దు.. బోట్ హెడ్‌గా ఉండండి అంటూ.. :
ఈ వీడియో ఆధారంగా దిగ్గజ సంస్థలకు పోటీగా బోట్ సంస్థ నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుందని అర్థం అవుతుంది. మరియు భారతీయ సంస్థలను ప్రోత్సహించాలని కోరినట్లు కనిపిస్తోంది. ఫ్యాన్‌బాయ్ గా ఉండొద్దని.. బోట్‌హెడ్ గా (Don't be a fan boy be a BoAt head) ఉండాలంటూ వీడియోలో చివరిగా కామెంట్ వినిపించింది.
కొందరు పాజిటివ్‌గా.. మరికొందరు నెగెటివ్‌గా.. :
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. బోట్ ఆవిష్కరణలు, క్రియేటివిటీని సపోర్టు చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం విమర్శలు చేస్తున్నారు. బోట్ ప్రకటన కేవలం మార్కెటింగ్ జిమ్మిక్ మాత్రమేనని విమర్శలు చేస్తున్నారు. బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదని అయితే ఫీచర్లు ఇతర అంశాలతో బ్రాండ్‌లతో పోటీపడాలని సూచిస్తున్నారు.
120 గంటల బ్యాటరీ బ్యాకప్ సహా...:
బోట్ తాజా యాడ్ మార్చి 30న విడుదల కాగా ఇప్పటి వరకు సుమారు 57 వేల మంది వీడియోను చూశారు. అయితే ఈ బోట్ TWS ఇయర్ పాడ్స్ (BoAt Airpods) పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ యాడ్ ఆధారంగా ఈ ఇయర్‌బడ్స్ 120 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుందని తెలుస్తోంది. మరియు నాణ్యమైన నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బోట్ ఇయర్‌బడ్స్ ధర, లాంచ్ సహా సేల్ వివరాలు వెల్లడికాలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








