ఇప్పుడు.. మీ మొబైల్ నుంచే రైలు టికెట్!

Posted By:

ఇప్పుడు.. మీ మొబైల్ నుంచే  రైలు టికెట్!

ఇక పై రైల్వే టికెట్‌ను బక్ చేసుకునేందకు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లవల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవల్సిందల్లా మీ ఫోన్ నుంచి 139 లేదా 5676714 నంబర్లకు రెండు సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్‌లు) పంపడమే. రైలు ప్రయాణానికి సంబంధించిన రైల్వే టికెట్‌లు ఇప్పటివరకు రిజర్వేషన్ కౌంటర్‌ల ద్వారానూ... ఆన్‌లైన్ ఇంటర్నెట్ బుకింగ్‌ల ద్వారానూ కొనుగోలు చేసేందుకు మాత్రమే అవకాశాలు ఉండేవి. నేరుగా మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా టికెట్ కొనుగోలు చేసుకొనే సదుపాయాన్ని రైల్వే శాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. అంతర్జాలం ఇంకా స్మార్ట్‌ఫోన్ సదుపాయం లేని సాధారణ సెల్‌ఫోన్ యూజర్లు సైతం ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.

ఐఆర్‌సీటీసీతో ఎయిర్‌టెల్ మనీ ఒప్పదం!

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో భారతీ ఎయిర్‌టెల్ ఓ ఒప్పందాన్ని కదుర్చుకుని మొబైల్ - ఆధారిత టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేకమైన సర్వీస్ ద్వారా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ యూజర్ తన మొబైల్‌లోని ఎయిర్‌టెల్ మనీ సర్వీసును ఉపయోగించుకుని ఒకటి అంతకన్నా ఎక్కువ సంఖ్యలో రైలు టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, టికెట్ అందుబాటు వివరాలు పీఎన్ఆర్ స్టేటస్, టెకెట్ రద్దు వంటి అదనపు సర్వీసులను పొందవచ్చు. ఈ సేవను పొందుగోరే ఎయిర్‌టెల్ వినియోగదారు ఐఆర్‌సీటీసీ ఇంకా ఎయిర్‌టెల్ మనీ అకౌంట్‌లను కలిగి ఉండాలి. ఈ రెండు సర్వీసులను సింక్ చేసేందుకు యూజర్ తన ఎయిర్‌టెల్ మనీ అకౌంట్ నెంబరును ఐఆర్‌సీటీసీ ప్రొఫైల్‌తో అనుసుంధానించాల్సి ఉంటుంది. *400#కు డయల్ చేయటం ద్వారా బకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ బుకింగ్ సిస్టం మొత్తం పూర్తిగా యూఎస్ఎస్‌డి పై కొనసాగుతుంది. టికెట్బుకింగ్ ప్రిక్రియ విజయవంతంగా పూర్తి అయిన అనంతరం ఐఆర్‌సీటీసీ నుంచి ఎస్ఎంఎస్ అందుతుంది. ఈ ఎస్ఎంఎస్‌ను టికెట్ ప్రూఫ్‌గా చూపిస్తే సరిపోతుంది.

మొబైల్ ఫోన్ ద్వారా రైలు టికెట్‌లను ఏలా బుక్ చేసుకోవాలి..?

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot