Home
News

ఇతరులకు రైల్వే టికెట్లు బుకింగ్‌ చేస్తున్నారా... కొత్త రూల్స్‌ ప్రకారం రూ.10,000 జరిమానా, జైలు శిక్ష..!!

రైల్వే టికెట్లను IRCTC ద్వారా బుకింగ్ చేసుకుంటున్నాం. స్టేషన్‌ కౌంటర్‌కు వెళ్లే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సులభంగా టికెట్లు బుకింగ్‌ చేస్తున్నాం. కొన్నిసార్లు స్నేహితులు సహా ఇతరులకు కూడా టికెట్లు బుకింగ్ చేస్తాం. మంచి ఉద్దేశంతోనే వారికి సాయం చేస్తాం. అయితే భవిష్యత్‌లో మీ వ్యక్తిగత IRCTC ఐడీ నుంచి ఇతరులకు టికెట్లను బుకింగ్‌ చేసినట్లయితే మీరు రిస్క్‌లో (IRCTC New Ticket Booking Rules 2024) పడే అవకాశం ఉంది. రైల్వే శాఖ జరిమానా, జైలు శిక్ష విధించనుంది.

ఇతరులకు మీ వ్యక్తిగత ఐడీ నుంచి టికెట్లను బుకింగ్‌ చేయడం రైల్వే శాఖ నేరంగా పరిగణిస్తోంది. ఇలా చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.10,000 జరిమానా విధించే అవకాశం ఉంది. లేదా రెండు విధించే అవకాశం ఉంది. ఈ వివరాలను రైల్వే టికెట్ల బుకింగ్‌ రూల్స్‌లో స్పష్టంగా తెలిపింది.

booking tickets for your friends and others from your IRCTC ID is a crime

రైల్వే చట్టం సెక్షన్‌ 143 ప్రకారం.. గుర్తింపు పొందిన రైల్వే ఏజెంట్లు మాత్రమే ఇతరులకు టికెట్లను బుకింగ్‌ చేసేందుకు అనుమతి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం IRCTC వ్యక్తిగత ఐడీతో కేవలం రక్త సంబంధీకులు మాత్రమే టికెట్లను బుకింగ్‌ చేయవచ్చు. మీ ఐఆర్‌సీటీసీ ఖాతా ఆధార్‌తో లింక్‌ చేసి ఉంటే నెలకు 24 టికెట్ల వరకు బుకింగ్‌ చేసుకోవచ్చు. లేకుంటే 12 టికెట్లను మాత్రమే బుకింగ్‌ చేసేందుకు వీలుంటుంది.

రైల్వే టికెట్ రిజర్వేషన్‌ వ్యవస్థలో జవాబుదారీతనం మరియు దుర్వినియోగాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ నిబంధలను తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే వివరాలు తెలియలేదు. దీంతోపాటు ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న టికెట్లపై చర్యలు తీసుకనే అవకాశం లేదని తెలుస్తోంది.

booking tickets for your friends and others from your IRCTC ID is a crime

ప్రస్తుతం రైల్వే టికెట్లను గరిష్ఠంగా 120 రోజుల ముందే బుకింగ్‌ చేసుకొనే వీలుంది. దాంతోపాటు రోజు ఉదయం 10 గంటలకు AC తత్వాల్ బుకింగ్ ప్రారంభం అవుతుంది. మరియు ఉదయం 11 గంటలకు నాన్‌ ఏసీ టికెట్లను బుకింగ్‌ చేసుకొనే అవకాశం ఉంటుంది.

* దీంతోపాటు ఈ సంవత్సరం మే నెలలో ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ రిజర్వడ్‌ టికెట్ల కోసం తీసుకొచ్చిన UTS యాప్‌ నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ యాప్‌ను 2018 లో రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. జనరల్‌ టికెట్ల కోసం రైల్వేస్టేషన్‌ క్యూలో వేచిచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ యాప్‌ నుంచి బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఈ UTS యాప్‌లో టికెట్‌ను బుకింగ్‌ చేసేందుకు కొన్ని నిబంధనలు ఉండేవి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేసింది. తాజా అప్‌డేట్ ద్వారా స్టేషన్‌కు ఎంత దూరంలో ఉన్నా కూడా టికెట్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చు. అయితే స్టేషన్‌ నుంచి ఈ యాప్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేయడం వీలుపడదు. కనీసం 5 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఈ UTS యాప్‌ ద్వారా 25 శాతం మంది ప్రయాణికులు టికెట్లు బుకింగ్‌ చేసుకుంటున్నారని రైల్వే తెలిపింది. 2022 లోనూ కొన్ని మార్పులు చేయగా.. తాజాగా మరింత సౌకర్యంగా టికెట్లను బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తే ఈ యాప్‌ ద్వారా సులభంగా బుకింగ్‌ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
booking tickets for your friends and others from your IRCTC ID is a crime
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X