BookMyShow OTT ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫీచర్స్ ఇవే....
ఇంతకు మునుపు ఏదైనా కొత్త సినిమాను థియేటర్లలో చూడాలనుకుంటే కనుక గంటల తరబడి లైన్ లో నిలబడడం లేదా బ్లాక్ లో టికెట్ లను కొనుగోలు చేసేవారు. తరువాత బుక్‌మైషో వంటివి అందుబాటులోకి రావడంతో కొత్త సినిమా టికెట్లే కాకుండా ఇతర ఈవెంట్ కార్యక్రమాల టిక్కెట్లను కూడా సులభంగా బుక్ చేసుకోగలుగుతున్నారు.

బుక్‌మైషో OTT
ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా సినిమాను థియేటర్లు కూడా పూర్తిగా మూతపడ్డాయి. ప్రతి ఒక్కరూ వారి ఇళ్లకే పరిమితం కావడం వలన బుక్‌మైషో యాప్ తన వినియోగదారులకు తమ ఇళ్ల వద్దకే వినోదాన్ని తీసుకురావడానికి కొత్త మార్గాన్ని కనుగొంది. బుక్‌మైషో యాప్ వినియోగదారులకు లైవ్ వినోదం అందించడం కోసం తన గ్లోబల్ ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. బుక్‌మైషో ఆన్‌లైన్ పేరుతో వీడియో స్ట్రీమింగ్ ను ఇండియా, యుఎస్, యుకె, జర్మనీ, UAE, సౌత్ ఈస్ట్ ఆసియా మరియు వెస్టిండీస్ వంటి దేశాలలో ఒకే సారి అందుబాటులోకి తీసుకురానున్నది.

బుక్‌మైషో ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ షోస్
ప్రముఖ లాటిన్ సంగీతకారుడు విల్లీ గోమెజ్, ఆస్ట్రేలియన్ పాప్ బ్యాండ్ ది బక్లీస్ మరియు అమెరికన్ మ్యూజిక్ ఆర్టిస్ట్ టేలర్ కాస్ట్రో యొక్క ప్రదర్శనలు మరియు ప్రపంచ వర్చువల్ టూర్లతో సహా 30 కి పైగా ఈవెంట్లను బుక్‌మైషో ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ లలో నిర్వహించిందని సంస్థ తెలిపింది. ఈ సంస్థ తన వర్చువల్ సన్‌బర్న్ హోమ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహిస్తుందని చెబుతున్నారు. బుక్‌మైషో ఆన్‌లైన్‌లో వీడియో స్ట్రీమింగ్ ను అందించడం కోసం బ్రైట్‌కోవ్ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది.

బుక్‌మైషో లైవ్ వీడియో స్ట్రీమింగ్ టెక్నాలజీ
బుక్‌మైషో సంస్థ తన ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం బ్రైట్‌కోవ్ సంస్థ యొక్క వీడియో టెక్నాలజీని ఎంచుకుంది. దీనిని ఎంచుకోవడానికి గల కారణం వినియోగదారుల యొక్క విశ్వసనీయత, స్కేలబిలిటీ, వేగం మరియు వాడుకలో సౌలభ్యం వంటి నాలుగు కస్టమర్ కీలకమైన అవసరాలను నెరవేర్చడం కోసం.

బుక్‌మైషో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫీచర్స్
బుక్‌మైషో యొక్క లైవ్ స్ట్రీమింగ్ ఒకే సారి చాలా లైవ్ ఈవెంట్‌లను స్పిన్ చేయగల సామర్థ్యంను కలిగి ఉంది. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం మరియు స్ట్రీమింగ్ కంటెంట్ కోసం వేగవంతమైన వీడియో ప్లేయర్‌ను అందించడం వంటి అదనపు ప్రయోజనాలను కూడా బ్రైట్‌కోవ్ సంస్థ అందిస్తున్నది. స్థానిక సంస్థల మద్దతుతో కలిపి బుక్‌మైషో త్వరగా లైవ్ ను ప్రసారం చేయడం ద్వారా ఫస్ట్-మూవర్ ప్రయోజనాన్ని కలిగి ఉంది. కళాకారులు, సంగీతకారులు మరియు హాస్యనటుల యొక్క షోలను ప్రత్యక్ష ప్రసారం చేయడం మరియు వారి కంటెంట్‌ను మోనటైజ్ చేయడం, ఒకే సమయంలో సామూహిక కచేరీలు వంటి వాటిని లైవ్ గా ప్రసారం చేయడం కోసం బుక్‌మైషోతో భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణంగా ఉంది అని బ్రైట్‌కోవ్ ఇండియా సేల్స్ డైరెక్టర్ వినిత్ మెహతా తెలిపారు.


Click it and Unblock the Notifications








