BookMyShow లో కొత్తగా స్ట్రీమ్ సర్వీస్!! 600 కి పైగా సినిమాలు
ఇండియాలో ఆన్ లైన్ ద్వారా మూవీ మరియు ఈవెంట్ షోలకు బుకింగ్ చేసుకునే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లలో 'బుక్‌మైషో' ఒకటి. ఈ సంస్థ ఇప్పుడు తన వెబ్ మరియు యాప్ వినియోగదారులకు హోమ్ గ్రోన్ ట్రాన్సషన్ వీడియో-ఆన్-డిమాండ్ (TVOD) ప్లాట్‌ఫారమ్ 'బుక్‌మైషో స్ట్రీమ్' ను అందిస్తోంది. సంస్థ తన కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా వినోదాత్మక కంటెంట్‌ను అందించడం ఇదే మొదటిసారి. వినియోగదారుల వినియోగం దృష్ట్యా 'బుక్‌మైషో స్ట్రీమ్' లో 600 కి పైగా సినిమాలతో 72,000+ గంటల కంటెంట్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ లో ప్రతి శుక్రవారం అనేక మార్క్యూ ప్రీమియర్‌లు ఉంటాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బుక్‌మైషో స్ట్రీమ్ మార్క్యూ ప్రీమియర్
బుక్‌మైషో స్ట్రీమ్ ప్లాట్‌ఫారమ్‌లోని గంటల కొద్దీ విలువైన కంటెంట్ ను వినియోగదారులు కొనుగోలు, అద్దె పద్దతిలో చూడగలరు. ఈ ప్లాట్‌ఫామ్ మొదట 22,000 గంటలకు పైగా ప్రత్యేకమైన కంటెంట్ తో ప్రారంభించడం గమనార్హం. ప్రతి శుక్రవారం వినియోగదారులకు బుక్‌మైషో స్ట్రీమ్‌లో అనేక కొత్త మార్క్యూ ప్రీమియర్‌లను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది స్మార్ట్ ప్లాట్‌ఫామ్ కావున ఇది వివిధ రకాల వినియోగదారులకు నిర్దిష్ట రకాల కంటెంట్‌ను సిఫారసు చేస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ టెనెట్, ది క్రాఫ్ట్: లెగసీ మరియు గాల్ గాడోట్ నటించిన వండర్ వుమన్ 1984 వంటి పెద్ద బ్లాక్ బస్టర్‌లు ఈ రోజు నుండి మార్క్యూ ప్రీమియర్ విభాగం కింద ఈ వేదికపై అందుబాటులో ఉన్నాయి.

బుక్‌మైషో భాగస్వామ్య సంస్థలు
బుక్‌మైషో ప్రీమియర్ ప్లాట్‌ఫారమ్ వార్నర్ బ్రదర్స్, సోనీ పిక్చర్స్, యూనివర్సల్ పిక్చర్స్ వంటి ప్రొడక్షన్ దిగ్గజాలతో భాగస్వామ్యం కలిగి ఉంది. కావున వారి యొక్క అన్ని సినిమాలు మరియు సిరీస్‌లను మరిన్నిటిని తమ ప్లాట్‌ఫామ్‌లో యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ఇవే కాకుండా ప్రధాన భారతీయ నిర్మాణ సంస్థలైన షెమరూ, వయాకామ్ 18, రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్ వంటి మరిన్ని బుక్‌మైషోతో తమ కంటెంట్‌ను దాని ప్లాట్‌ఫామ్‌లో అందించడానికి భాగస్వామ్యం చేసుకున్నాయి.

బుక్‌మైషో స్ట్రీమ్ కంటెంట్
బుక్‌మైషో స్ట్రీమ్‌లో లభ్యమయ్యే కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన శీర్షికలలో ఒకటి మరియు వినియోగదారులు వినియోగించే విందుగా ఉంటుంది. ఇది పే-పర్-వ్యూ లేదా చందా మోడల్ కానందున, వినియోగదారులు దానిపై ఎలా స్పందిస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications