ఇకపై అమెజాన్ ద్వారా బుక్ మై షో టికెట్లు బుక్ చేసుకోవచ్చు

By Gizbot Bureau
|

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా బుక్‌మైషోతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది, ఇకపై ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ నుండి నేరుగా సినిమా టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తోంది. దీన్ని ఎలా బుక్ చేసుకోవాలంటే అమెజాన్‌లో షాప్ బై కేటగిరీ విభాగం కింద కొత్తగా 'మూవీ టికెట్స్’ అనే ఆప్సన్ జోడించారు. ఇది ప్రైమ్‌ మెంబర్ షిప్‌తో పాటు ప్రైమ్-కాని సభ్యులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మూవీ టిక్కెట్లను బుక్ చేయడమే కాకుండా, వినియోగదారులు సమీక్షలు మరియు రేటింగ్‌లకు కూడా చూడవచ్చు. ముఖ్యంగా, కొత్త మూవీ టికెట్ బుకింగ్ ఎంపిక మొబైల్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది అయితే ప్రస్తుతం డెస్క్‌టాప్ వెబ్‌సైట్‌లో ఈ ఫీచర్ ఇంకా విడుదల కాలేదు.

బుక్‌మైషోతో భాగస్వామ్యం
 

బుక్‌మైషోతో భాగస్వామ్యం

అమెజాన్.ఇన్లో కొత్త కేటగిరీగా ఇంటి వెలుపల సినిమా వినోదాన్ని అందించడానికి బుక్‌మైషోతో భాగస్వామ్యం కావడం పట్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా కస్టమర్ల జీవితాలను సాధ్యమైన ప్రతి విధంగా సరళీకృతం చేయడమే మా లక్ష్యం - వారు షాపింగ్ చేసేటప్పుడు, బిల్లులు చెల్లించేటప్పుడు లేదా ఇతర సేవలను కోరుకునేటప్పుడు ఈ భాగస్వామ్యం మరో మెట్టు "అని అమెజాన్ పే డైరెక్టర్ మహేంద్ర నెరుర్కర్ అన్నారు.

కొన్ని ప్రశ్నలు

కొన్ని ప్రశ్నలు

వినియోగదారులు కొత్త ‘మూవీ టికెట్లు' ఎంపికలను ‘Shop by Category' విభాగం కింద లేదా Flights section పక్కన ఉన్న అమెజాన్ పే ట్యాబ్‌లో చూడవచ్చు. ఈ ఎంపికను ఎంచుకున్న తర్వాత, మీరు మొదటిసారి బుక్‌మైషోను ఉపయోగించినప్పుడు మీకు అందులో కొన్ని ప్రశ్నలు మీకు కనిపిస్తాయి. వినియోగదారులు వారి ప్రాంతం, ఖచ్చితమైన జోన్ మరియు ఇష్టపడే సినిమాలను ఎన్నుకోమని అందులో అడుగుతారు, అప్పుడు మీరు సినిమా థియేటర్, ప్రదర్శన సమయం మరియు ప్రతి సీటుకు ధరను ఎంచుకోవచ్చు.

ఏదైనా చెల్లింపు ద్వారా..

ఏదైనా చెల్లింపు ద్వారా..

అమెజాన్ పే బ్యాలెన్స్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే యుపిఐ మరియు ఇతర రకాల డిజిటల్ చెల్లింపులతో సహా ఏదైనా చెల్లింపు ఎంపికలను ఉపయోగించి మీరు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

క్యాష్ బ్యాక్ 
 

క్యాష్ బ్యాక్ 

ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ కస్టమర్లు నెలవారీ స్టేట్మెంట్ రివార్డులుగా 2 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు మరియు లాంచ్ ఆఫర్‌లో భాగంగా, అమెజాన్ మూవీ టికెట్ బుకింగ్‌లపై రూ .200 వరకు 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది,

Most Read Articles
Best Mobiles in India

English summary
BookMyShow Will Now Let You Book Movie Tickets From Amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X