Home
News

ఐఫోన్‌లో Game Performanceను బూస్ట్ అప్ చేయడం ఎలా ?

ఎంతటి గొప్ప స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తక తప్పదు. ఇక ఐఫోన్ అంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కొన్న ఐఫోన్ లో సమస్యలు వస్తే చాలా బాధపడతాం.ఇక ఈ మధ

ఎంతటి గొప్ప స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సాంకేతిక లోపం తలెత్తక తప్పదు. ఇక ఐఫోన్ అంటే క్రేజ్ అంతా ఇంతా కాదు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కొన్న ఐఫోన్ లో సమస్యలు వస్తే చాలా బాధపడతాం.ఇక ఈ మధ్య కాలంలో ఫోన్లలో గేమ్స్ ఆడటం అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల ఫోన్ స్లో కావడం అలాగే స్ట్రక్ కావడం జరుగుతూ వస్తూ ఉంటుంది.

ఐఫోన్‌లో Game Performanceను బూస్ట్ అప్ చేయడం ఎలా ?

ఐఫోన్ యూజర్లకు కూడా ఈ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి గేమ్ ఆడే సమయంలో ఐఫోన్ లో గేమింగ్ ఫెర్మాఫెర్మెన్స్ ని పెంచుకోవడం ఎలా అనే దాని మీద ఈ శీర్షికలో కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

అప్ డేట్స్

అప్ డేట్స్

మీ ఫోన్ పాతది అయి ఉంటే వెంటనే లేటెస్ట్ వర్షన్ కు అప్ డేట్ అవ్వండి. దీని వల్ల ఫోన్ స్లో కావడం జరగదు. మీ ఫోన్ ఐఫోన్ వర్షన్ కి అప్ డేట్ కావడం వల్ల గేమ్ లో మరింతగా వేగం పెరుగుతుంది. ఇందుకోసం మీరు Settings > General > Software Updateని ఫాలో అవ్వండి. అక్కడ మీకు సాప్ట్ వేర్ అప్ డేట్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది

యాప్స్ క్లోజ్

యాప్స్ క్లోజ్

మీ హోమ్ బటన్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్లో యాప్స్ ఏం రన్ అవుతున్నాయో తెలుస్తుంది. వాటిని వెంటనే క్లోజ్ చేయండి. కొన్ని యాప్స్ బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతూ పాయిజన్ లాగా తయారవతుంటాయి. మీరు గేమ్ ఆడే సమయంలో వెంటనే యాప్స్ ని క్లోజ్ చేయండి.

ఆటోమేటిక్ అప్ డేట్స్

ఆటోమేటిక్ అప్ డేట్స్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ఐఓఎస్లలలో ఆటోమేటిక్ అప్ డేట్స్ ఫీచర్ ఉంటుంది. మీకు తెలియకుండా ఏమైనా బ్యాక్ గ్రౌండ్స్ యాప్స్ రన్ అవుతుంటే ఆ యాప్స్ ఒక్కోసారి ఆటోమేటిగ్గా అప్ డేట్ అవుతుంటాయి. వీటిని టర్న్ ఆప్ చేస్తే మీ ఫోన్ మరింతగా బూస్ట్ అవుతుంది.

జీపిఎస్

జీపిఎస్

యాప్స్ ప్రతి ఒక్క దానికి లిమిట్ లొకేషన్ ఉంటుంది. వీటిని పరిమితంగా ఉంచుకోవడం ద్వారా మీరు మీ ఫోన్ బూస్ట్ ని మరింతగా పెంచుకోవచ్చు. దీనికోసం మీరు Settings > Privacy > Location Services సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

గ్రాఫిక్స్

గ్రాఫిక్స్

ఐఓఎస్ 7లో ఆపిల్ విజువల్ ఎఫెక్ట్స్ ని పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ సమయంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వీటిని టర్న్ ఆఫ్ చేయడం ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందవచ్చు.ఇందుకోసం మీరు Settings > General > AccessibilityలోReduce Motionని ఎనేబుల్ చేయండి.

 స్టోరేజ్

స్టోరేజ్

ఎప్పటికప్పుడు స్టోరేజ్ క్లియర్ చేసుకోవడం ద్వారా కూడా మీరు మరింతగా గేమింగ్ బూస్ట్ ని పొందవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ నిండిపోతే ఫోన్ ఆటోమేటిగ్గా స్ట్రక్ అవుతూ ఉంటుంది.

జంక్ ఫైల్స్

జంక్ ఫైల్స్

మీ మ్యాక్ సిస్టంలో iPhone System Care Pro ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు జంక్ ఫైల్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. తద్వారా మీరు మీ గేమింగ్ ను మరింతగా ఫాస్ట్ గా ఆడుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How To Boost Up Game Performance In Your iPhone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X