బోస్టన్ బాంబు పేళుళ్లు: సెల్‌ఫోన్‌లను ఉపయోగించారా?

Posted By:

బోస్టన్‌లో చోటుచేసుకున్న ముష్కరమూకల దాడులు అమెరికాను అతలాకుతలం చేసాయి. శాంతి సామరస్యంతో సాగుతున్న 117వ బోస్టన్ మారథాన్ పై ఉగ్రవాదులు ఆధునిక పేలుడు సాధనాలతో విరుచుకుపడి జరిపి ముగ్గురను బలిగొన్నారు. ఈ ఘటనలో 100మంది పైగా క్షతగాత్రులైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.45నిమిషాలకు మొదటి బాంబు పేలింది. ఈ పేలుడు చోటుచేసుకున్న కొద్ది నిమిషాల్లోనే 50 నుంచి 100 అడుగులు దూరంలో మరో విస్పోటనం సంభవించింది.

భద్రతా సిబ్బంది సంఘటనా స్థలంలో ముమ్మర తనిఖీలు నిర్వహించగా మరో రెండు పేలుడు పరికరాల లభ్యమవటంతో వాటిని నిర్వీర్యం చేసారు. ఎంచుకున్న ప్రాంతాల్లో ఇంప్రోవైజ్ద్ ఎక్స్ప్లోజివ్ పరికరాలను వినియోగించిన ముష్కరులు వాటిని సెల్‌ఫోన్‌ల సాయంతో ఆపరేట్ చేసినట్లు అనుమానులు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఫెడలర్ ఇంటెలిజెన్సీ వర్గాలు ఈ అంశాన్ని ధృవీకరించాల్సి ఉంది.

జంట పేలుళ్ల నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్ ప్రటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బోస్టన్ జంట పేలుళ్ల ఘటనపై మాసాచుసెట్స్ గవర్నర్, బోస్టన్ మేయర్ సమీక్షిస్తున్నారు. పేలుళ్ల ఘటన నుంచి ఒబామా ఖండించారు. పేలుళ్ల అనంతరం ఆయన శ్వేత సౌధం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పేలుళ్లపై విచారణ జరిపించి, అందుకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని ఒబామా హామీ ఇచ్చారు. పేలుళ్ల అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై ఆయన

మాసాచుసెట్స్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సంఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. కాళ్లు పోయినవారున్నారు. కొంత మంది స్పృహ తప్పి పడిపోయారు. మృతుల్లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

సంచలనం రేపుతున్న శాటిలైట్ ఫోటోలు!

Read more about:
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot