Boycott China సెంటిమెంట్: మా బిజినెస్ కు ఏం ఢోకా లేదు.

By Maheswara
|

ఇండియా చైనా బోర్డర్ లో జరుగుతున్న ఘర్షణ వాతావరణం కారణంగా,మరియు కరోనా వైరస్ చైనా వైరస్ ఏ అని, చైనా లోనే పుట్టిందని అనుమానాల కారణం తో ఇండియా లోని ప్రజల ఆలోచన విధానాలలో చైనా పట్ల ఎంతో మార్పు వచ్చింది.ఈ కారణంతోనే చాలా మంది చైనా వస్తువులు బహిష్కరించాలని సామజిక మాధ్యమాలలో పోస్ట్ లు చేస్తున్నారు.ఈ పోస్టులను పరిశీలిస్తే చైనా పట్ల ప్రజలలో చాలా వ్యతిరేకత ఉందని అర్థం చేసుకోవచ్చు.

సీఈఓ మనుకుమార్ జైన్

సీఈఓ మనుకుమార్ జైన్

కానీ ఈ విషయాలు ఏవి తమ బిజినెస్ కు అడ్డంకులు కాదని దీని వల్ల షియోమీ ఇండియా బిజినెస్ ఏ విధంగానూ ప్రభావితం కాదని కంపెనీ సీఈఓ మనుకుమార్ జైన్ ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు.

మనుకుమార్ జైన్ మాట్లాడుతూ

మనుకుమార్ జైన్ మాట్లాడుతూ

గత 6 సంవత్సరాలలో కంపెనీ తరపున రీసెర్చ్ ల్యాబ్ లు  ,ఉత్పత్తి ప్లాంటు లు ప్రారంభించామని,వీటి ద్వారా 50 వేల మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని" తెలియ చేశారు. అంతే కాక మార్కెట్లో చాలా ఫోన్లు వందశాతం చైనాలోనే తయారైనవి వున్నాయి ,కొన్ని ఫోన్లు అక్కడ తయారయి ఇక్కడి వి గా కూడా చెలామణి అవుతున్నాయి కానీ షియోమీ ఫోన్లు ఆలా కాదని భారతీయుల కోసం ఇక్కడే తయారవుతున్నాయని  ఫోన్ల లో వాడే భాగాలు కూడా 65% వరకు ఇండియా లో తయారైనవే అని అందువల్ల ఇతర కంపెనీ లతో పోలిస్తే తమ ఫోన్లు పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా అని తెలిపారు .

షియోమీ ఫోన్లు ఇండియాలో ప్రథమ స్థానంలో
 

షియోమీ ఫోన్లు ఇండియాలో ప్రథమ స్థానంలో

షియోమీ ఫోన్లు ఇండియాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి,ఇండియా చైనా సరిహద్దు వివాదాల కారణంగా బిజినెస్ కు ఎలాంటి దెబ్బ లేదని ఆశాభావం వ్యక్తం చేశారు.సరిహద్దు వివాదాల కారణం గా చైనా వస్తువులపై చాలా వ్యతిరేకత ఉన్నట్లు సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతుందని కానీ ఇలాంటి విషయాలు సోషల్ మీడియా కు మాత్రమే పరిమితం అవుతాయని, వినియోగ దారుడు ఇలాంటి విషయాలని ఆలోచించరని తెలియచేసారు.షియోమీ సంస్థ ఇండియాలో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాక ఎక్కువ టాక్స్ లు చెల్లిస్తున్న సంస్థ లలో ఒకటని గుర్తుచేశారు.

1 లక్ష అమ్మకాలు

1 లక్ష అమ్మకాలు

ఒక వేల నిజంగానే ప్రజలలో వ్యతిరేకత బిజినెస్ పైన ప్రభావం చూపించ గలిగితే, ఈ మధ్యే విడుదల అయిన షియోమీ కొత్త ఇయర్ బడ్స్ రికార్డు అమ్మకాలు జరిగేవి కాదని ,1 లక్ష అమ్మకాలు జరిగాయని కూడా తెలియ చేసారు.

Best Mobiles in India

Read more about:
English summary
Boycott China Sentiment: Xiaomi India business won't impact : Manu Jain says 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X