బిపివో కంపెనీలో పనిచేస్తున్న యువతిపై రేప్ ప్రయత్నం

Posted By: Staff

బిపివో కంపెనీలో పనిచేస్తున్న యువతిపై రేప్ ప్రయత్నం

ఈ మధ్య కాలంలో ఢిల్లీ మహానగరంలో ఆడవారికి భద్రత లేకుండా పోయింది. మొన్నటి మొన్న నడిరోడ్డు మీద ఒక అమ్మాయిని కిరాతకంగా హాత్య చేశారు. అది అవ్వకముందే ఇప్పుడు మరో అతను బిపివో కంపెనీలో పని చేస్తున్న యువతిని రేప్ చేయడానికి ప్రయత్నించాడు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని మహాత్మ గాంధీ రోడ్డులో ఉన్నటువంటి విపుల్ అఘోరా కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

మణిపూర్ నుండి వచ్చినటువంటి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ యువతి నార్త్ క్యాంపస్ ఢిల్లీలో నివసిస్తుంది. ఆమె ఢిల్లీ మహానగరంలో ఆమె కన్వర్జీస్ బిపివోలో ఉద్యోగం చేస్తుంది. ఏదో చిన్న పని మీద గురువారం సాయంత్రం మహాత్మ గాంధీ రోడ్డులో ఉన్నటువంటి విపుల్ అఘోరా కమర్షియల్ కాంప్లెక్స్‌కి వెళ్శడం జరిగింది. ఆ సమయంలో ఆమెను చూసినటువంటి సంజయ్ షెకావత్ అనే యువకుడు ప్రక్కనే ఉన్నటువంటి క్లబ్ వెనుకకు లాక్కోని వెళ్శి ఆమెని రేప్ చేయడానికి ప్రయత్నిచాడు. ఆ సమయంలో ఆమె గట్టిగా అరవడానికి ప్రయత్నించగా చంపేస్తానని బెదిరించాడు.

దాంతో అతనినుండి ఆ యువతి తప్పించుకోని దగ్గరలో ఉన్నటువంటి డిఎల్‌యప్ పోలీస్ స్టేషన్‌కి వెళ్శి జరిగిన విషయం విపులంగా పోలీసులకు విన్నవించడం జరిగింది. దాంతో ఆ కంప్లైంట్‌ని తీసుకన్న పోలీసులు అతని మీద ఇండియన్ ఫీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 323, 354, 506 లాంటి కేసులు సమోదు చేశారు. ఆ తర్వాత అతనిని మహాత్మ గాంధీ రోడ్డులో ఉన్నటువంటి విపుల్ అఘోరా కమర్షియల్ కాంప్లెక్స్‌ లోనే అరెస్టు చేయడం జరిగింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting