పేస్ బుక్ ద్వారా 'బ్రహ్మోస్' క్షిపణికి సంబంధించిన విషయాలను పాకిస్థాన్ కి చేరవేస్తున్న సైంటిస్ట్

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ‘బ్రహ్మోస్‌'కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్న గూఢచారిని అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

|

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి 'బ్రహ్మోస్‌'కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్న గూఢచారిని అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతోనే అతని ఇంటిపై దాడి చేసి అరెస్ట్‌ చేశామని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ వెల్లడించారు. పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులతో నిశాంత్‌ ఫేస్‌బుక్‌ ద్వారా మాట్లాడుతున్నట్లు వారు గుర్తించామన్నారు. మహిళల పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి, పాకిస్థాన్‌ నుంచి వలపు వల విసురుతున్న వారిపై ఏటీఎస్‌ దృష్టి సారించిందని ఆ క్రమంలోనే అగర్వాల్‌ బండారం అంతా బయటపడినట్టు వారు తెలిపారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోందని అసీమ్‌ అరుణ్‌ వెల్లడించారు.

నిశాంత్‌  నాగపూర్ లోని  వార్ధా రోడ్డులో....

నిశాంత్‌ నాగపూర్ లోని వార్ధా రోడ్డులో....

రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న నిశాంత్‌ నాగపూర్ లోని వార్ధా రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటున్నాడు.

నాగ్‌పూర్‌లోని డీఆర్‌డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్‌ క్షిపణి పరిశోధన కేంద్రం’లో....

నాగ్‌పూర్‌లోని డీఆర్‌డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్‌ క్షిపణి పరిశోధన కేంద్రం’లో....

నాగ్‌పూర్‌లోని డీఆర్‌డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్‌ క్షిపణి పరిశోధన కేంద్రం'లో నిశాంత్‌ అగ్రవాల్‌ గత నాలుగేళ్ల నుంచి ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్‌ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు మరికొన్ని దేశాలకు నిశాంత్‌ చేరవేసినట్లు భారత్‌ నిఘా వర్గాలు గుర్తించాయి.

సోమవారం ఉదయం నిశాంత్‌ నివాసానికి చేరుకున్న మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు....
 

సోమవారం ఉదయం నిశాంత్‌ నివాసానికి చేరుకున్న మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు....

సోమవారం ఉదయం 5.30 గంటలకు నిశాంత్‌ నివాసానికి చేరుకున్న మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్త బృందం అతడిని అరెస్ట్‌ చేసింది. అనంతరం సాయంత్రం వరకూ ఆ ఇంట్లో సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో నిశాంత్‌ ల్యాప్‌టాప్‌లో బ్రహ్మోస్‌తో పాటు క్షిపణి వ్యవస్థలకు సంబంధించి కీలకమైన సమాచారం లభ్యమైందని ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఐజీ అసీమ్‌ అరుణ్‌ తెలిపారు.

దాదాపు ఏడాదికాలంగా....

దాదాపు ఏడాదికాలంగా....

ఈ విషయమై ఇంటి యజమాని మనోహర్‌ కాలే మాట్లాడుతూ దాదాపు ఏడాదికాలంగా నిశాంత్‌ తమ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడని తెలిపారు. అద్దెకు దిగేందుకు ఆధార్‌ కార్డు కాపీతో పాటు డీఆర్‌డీవో జారీచేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాడన్నారు. ఆధార్‌ కార్డులోని వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నిశాంత్‌ స్వస్థలమని వెల్లడించారు.

భారత్‌కు చెందిన డీఆర్‌డీవో....

భారత్‌కు చెందిన డీఆర్‌డీవో....

భారత్‌కు చెందిన డీఆర్‌డీవో, రష్యాకు చెందిన మిలటరీ ఇండస్ట్రియల్‌ కన్సార్టియం(ఎన్‌పీవోఎం) సంయుక్తంగా ఏర్పాటుచేసిన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ‘బ్రహ్మోస్‌ క్షిపణి'ని తయారుచేసింది.

Best Mobiles in India

English summary
BrahMos Engineer Arrested For Spying, "Chatted On Facebook With Pak IDs".To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X